బైక్‌కు టపాసులు కట్టి యువకుడు డేంజరస్ స్టంట్స్.. చివరికి షాక్

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది రకరకాల స్టంట్లు చేస్తున్నారు.ముఖ్యంగా యువత రోడ్లపై బైక్‌లతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కంటపడుతున్నారు.

ముందు చక్రం గాల్లోకి లేపి బైక్‌లను వేగంగా పోనిస్తున్నారు.అనుకోని రీతిలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

అయితే దీపావళి( Diwali ) సందర్భంగా కొందరు యువకులు బాణసంచా కాల్చుతూ బైక్ స్టంట్స్( Bike Stunts ) చేశారు.

ఒళ్లు గగుర్పొడిచే రీతిలో విన్యాసాలు ప్రదర్శించాడు.ఏ మాత్రం పట్టు తప్పి కింద పడితే ప్రాణాలు పోయే అవకాశం ఉంది.

అయినా ఆ యువకులు వెనుకంజ వేయలేదు.మొత్తం 10 మందికి పైగా రహదారిపై ఈ ప్రమాదకర విన్యాసాలలో పాల్గొన్నారు.

"""/" / ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.అంతే స్థాయిలో వారిపై విమర్శలు వచ్చాయి.

దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.దీపావళి సందర్భంగా తమిళనాడులోని తిరుచ్చిలో( Tiruchi ) ఇటీవల కొందరు యువకులు నడిరోడ్డుపై స్టంట్స్ చేశారు.

బైక్‌కు కొందరు యువకులు టపాసులు( Crackers ) అమర్చారు.అనంతరం ఆ బైక్‌ను ఓ యువకుడు నడిపాడు.

అందులోనూ బైక్ ముందు చక్రం గాల్లోకి లేపి ముందుకు పోనిచ్చాడు.ఆ సమయంలో బైక్‌కు కట్టిన బాణసంచా నిప్పులు కక్కుతూ పేలింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే పోలీసులు స్పందించారు. """/" / దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొద్ది గంటల్లోనే బైక్ స్టంట్స్ చేసిన అజయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

వైరల్ వీడియోలో, యువకుడు తన మోటార్‌సైకిల్‌పై పలు షాట్‌లతో క్రాకర్లు పేల్చడం స్పష్టంగా కనిపిస్తుంది.

తర్వాత బైక్ ముందు చక్రాన్ని గాలిలో లేపి అధిక వేగంతో నడుపుతారు.ఈ వీడియోను షూట్ చేస్తున్నప్పుడు స్పాట్‌లో ఉన్న కొంతమంది అబ్బాయిలు హ్యాపీ దీపావళి అని చెప్పడం వినొచ్చు.

నవంబర్ 9న నిందితులు ఈ వీడియోను చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు.విచారణలో ఇన్‌స్టాగ్రామ్‌లో 'డెవిల్ రైడర్' పేజీలో దీనిని పోస్ట్ చేశారని వెల్లడించారు.

ఈ కేసులో మొత్తం 10 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.

వీడియో వైరల్.. హిజ్బొల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన పైలెట్ కు ఘన స్వాగతం!