ప్రేమతో పెంచుకున్న ఎద్దు చనిపోవడంతో… ఆ రైతు ఏం చేసాడంటే…?!

ఎవరికైనా సరే వారితో పాటు ప్రతిరోజు కలిసి మాట్లాడే వారు, కలిసి జీవించేవారు సడన్ గా ఈ లోకాన్ని వదిలి వెళితే ఆ బాధ వర్ణనాతీతం.

వారు ఈ ప్రపంచాన్ని వదిలి పెట్టిన కూడా మనం ఏ పని చేసిన వారు మనకు కచ్చితంగా పక్కనే ఉన్నట్లు గుర్తుకొస్తుంటారు.

ఇలాంటి విషయాలు కేవలం మనుషులు మనుషుల్ని కోల్పోతూనే మాత్రమే కాకుండా.వారితో పాటు నిత్యం జీవనం కొనసాగించే జంతువులు కూడా దూరం అయినప్పుడు ఇలాంటి అనుభూతినే పొందుతారు.

ఇలాంటి ఈ సంఘటన ఒకటి తాజాగా తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూర్‌ జిల్లా పాపంపాళయం పనకాట్టుతోట ప్రాంతానికి చెందిన చెల్లముత్తు తన తోటలో గాంగేయం జాతి ఎద్దును 10 సంవత్సరాలుగా ఓ రైతు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు.

అయితే 2 సంవత్సరాల క్రితం ఆ ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది.ఇక అప్పటి నుండి ఆ ఎద్దుకు జ్ఞాపకార్ధంగా ఏదో ఒకటి చేయాలని సదరు రైతు నిర్ణయించుకున్నాడు.

ఇక చివరిగా ఆయన తన ఎద్దు జ్ఞాపకార్థంగా ఓ స్మారక మందిరం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

దీనితోనే తన తోటలోని ఓ ప్రాంతంలో మండపంని ఏర్పాటు చేసి అందులో ఆ ఎద్దు ఆకృతి కలిగి ఉన్నపెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.

ఇందుకు సంబంధించి సదరు రైతు చెల్లముత్తు మాట్లాడుతూ.ఎద్దు 4 లేగదూడలకు జన్మ ఇచ్చిందని, కుటుంబంలో సభ్యుల లాగే ఎద్దు కూడా మాలో ఒకరిగా పెరిగిందని, అయితే ఎద్దు అనారోగ్యం తో మృతిచెందడంతో ఎద్దు స్మారకార్థం కోసం ఒక స్మారక మందిరాన్ని నిర్మించినట్లు అతడు తెలియజేశాడు.

క్యాడర్ కు ధైర్యం నూరిపొస్తున్న కేసీఆర్