సుప్రీంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఎదురుదెబ్బ
TeluguStop.com
తమిళనాడు సీఎం స్టాలిన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీలు నిర్వహించుకునేందుకు ధర్మాసనం అనుమతిని ఇచ్చింది.
గాంధీ జయంతితో పాటు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ కోరగా స్టాలిన్ సర్కార్ నిరాకరించింది.
ఈ నేపథ్యంలో గత నవంబర్ లో ఆర్ఎస్ఎస్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.దీంతో కొన్ని షరతులతో ర్యాలీలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు.
కానీ మద్రాసు హైకోర్టు తీర్పును స్టాలిన్ సర్కార్ సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టును సమర్థిస్తూ గవర్నమెంట్ పిటిషన్ ను కొట్టివేసింది.
Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters