ఉచిత హామీ పథకాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
తమిళనాడు సీఎం స్టాలిన్ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా విద్య, వైద్యంకి ప్రభుత్వం పెట్టే ఖర్చును తాయిలాలుగా చూడొద్దని తెలిపారు.ఉచిత హామీ పథకాలపై ప్రధాని మోడీతో పాటు మరి కొంత మంది బిజెపి నాయకులు గత కొన్ని రోజుల నుండి వరుసగా విమర్శలు చేస్తూ ఉన్నారు.
ఈ విషయం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లడం జరిగింది.దీంతో ఎంకే స్టాలిన్ స్పందించి.
ప్రజలకు విద్యా అదే విధంగా వైద్య రంగాలపై ప్రభుత్వాలు పెట్టే ఖర్చును ఉచితాలుగా భావించొద్దని సూచించారు.
ప్రజలకు జ్ఞానాన్ని ఇచ్చేది విద్య.అదేవిధంగా ఆరోగ్యాన్ని ఇచ్చేది వైద్యం, మందులు.
ఈ రెండిటి విషయంలో తగిన సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
వీటిని ఉచితాలుగా భావించవద్దు.సామాజిక సంక్షేమ కార్యక్రమాలుగా చూడాలని సూచించారు.
పేదలకు అదే విధంగా వెనకబడిన వర్గాలకు ఆపదలో ఉన్న వారికి ప్రయోజనం కలిగించేవి అని తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఉచిత పథకాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
వీరు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కొంతమంది సలహాలు ఇస్తున్నారు.అలాంటి వాటిని.
మేం పట్టించుకోము.ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడితే రాజకీయమవుతుంది అంటూ తనదైన శైలిలో స్టాలిన్ చెప్పుకొచ్చారు.
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?