ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఒకేరోజు రూ.32 కోట్లు.. !

ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కరోనా వల్ల ఎదురైయ్యే కష్టాలకు ఎదురీదుతున్నాయి.ఇలాంటి సమయం లో రాష్ట్రాన్ని పాలించే నాయకుడు సమర్ధుడు అయితే ఎలాంటి విపత్తులు వచ్చినా సులువుగా దాటగలరు.

ప్రజలకు కూడా ఎక్కువగా ఇబ్బందులు ఎదురవవు.అదే రాష్ట్రాన్ని పాలించే నాయకుడు పదవి దాహంతో స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తే ఆ రాష్ట్రం పూర్తిగా అగాధంలోకి వెళ్లిపోతుంది.

తెలియకుండానే అప్పుల కుప్పలుగా మారడం, ఆ అప్పులు తీర్చడానికి విపరీతంగా పన్నులు వసూల్ చేయడం, మొత్తంగా ప్రజల మీద భరించలేని భారం వేయడం జరుగుతుంది.

మంది ఎక్కువైతే మజ్జిగ పలుచగా అయ్యినట్లుగా అవినీతి పరులతో పార్టీలు నిండిపోతే ఇక ఆ రాష్ట్రం లో ప్రజలు ఆనందంగా జీవించడం కల్ల.

అదే సమర్ధవంతుడైన నాయకుడు ఎలాంటి ఆపదలు వచ్చినా ప్రజల పక్షం నిలిచి వారి బాగుకోసమే ఆలోచిస్తాడు.

ఇకపోతే ఇలాంటి లక్షణాలు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ లో కనిపిస్తున్నాయని అనుకుంటున్నారట.

ఎందుకంటే కరోనా కట్టడిలో భాగంగా అందరిని సమన్వయపరచుకుంటూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు భారీగా విరాళాలు వచ్చేలా చేయడం అంటే మాటలు కాదు.

ఈ క్రమంలోనే పరిశ్రమల నగరం కోయంబత్తూర్‌ జిల్లాలో ఉన్న పరిశ్రమల యజమానులు అందరు కలిసి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఒకేరోజు రూ.

32 కోట్లు విరాళాలు అందించారట.ఇలా వచ్చే ఫండ్‌లో అవినీతి చోటు చేసుకోకుండా సక్రమంగా ఉపయోగిస్తే ఆ రాష్ట్రానికి ఇబ్బందులు ఎందుకు వస్తాయి అని అనుకుంటున్నారట.

రాయలసీమ, పల్నాడుల్లో ఉద్రిక్తతలు..!