అందుకే ఈ హీరోయిన్ చెల్లెలు స్టార్ హీరోయిన్ కాలేకపోయిందా...?

సినిమా రంగంలో స్టార్ హీరో లేదా హీరోయిన్ వారసులుగా నటీనటులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కొంత మంది నటీనటులు ఎందుకో నిలదొక్కుకోలేక పోతున్నారు.

ఇలాంటి వాళ్ళు చాలామందే సినిమా పరిశ్రమలో ఇప్పటికే ఉన్నారు.కాగా తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ హీరో "కమల్ హాసన్" గురించి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

అయితే కమల్ హాసన్ వారసురాలిగా సినిమా పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

కాగా ఇటీవలే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "వకీల్ సాబ్" చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించింది.

అలాగే తమిళం, కన్నడ, బాలీవుడ్, సినిమా పరిశ్రమలలో స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

కానీ కమల్ హాసన్ రెండవ కూతురు అక్షర హాసన్ మాత్రం ఆశించిన స్థాయిలో సినిమా ఇండస్ట్రీలో రాణించలేక పోతోంది.

అయితే అక్షర హాసన్ మధ్య ధనుష్ మరియు అమితాబ్ బచ్చన్ తదితరులు హీరోలుగా నటించిన "షమితాబ్" అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ చిత్రం ఫర్వాలేదనిపించడంతో తమిళం, హిందీ, తదితర భాషలలో వివాహ్ సింగ్, చియాన్ విక్రమ్, అజిత్ తదితర హీరోలతో కలిసి పలు చిత్రాలలో నటించింది.

కానీ ఈ అమ్మడు సినిమా పరిశ్రమపై పెద్దగా దృష్టి సారించలేకపోతోంది.దీనికితోడు ఈ అమ్మడికి ఉన్నటువంటి నిలకడ లేమి కారణంగా కొత్త సినిమాల కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ ప్రముఖ దర్శకుడు నవీన్ తెరకెక్కిస్తున్న "అగ్ని సిరాగూగుల్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలో హీరోలుగా అరుణ్ విజయ్, విజయ్ ఆంటోని తదితరులు నటిస్తున్నారు.ఏదేమైనప్పటికీ శృతి హాసన్ మాదిరిగా అక్షర హాసన్ సినిమా ఇండస్ట్రీలో క్లిక్ కాలేకపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో ప్రముఖ దర్శకుడు "ప్రశాంత్ నీల్" దర్శకత్వం వహిస్తున్న "సలార్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడు.అలాగే తమిళ్ ప్రముఖ దర్శకుడు ఎస్ బి జనార్ధన్ దర్శకత్వం వహిస్తున్న "లాబామ్" అనే తమిళ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలో హీరోగా విజయ్ సేతుపతి నటిస్తుండగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.

మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.-  తెలుగుస్టాప్.

కామ్ యాజమాన్యం.

సిల్క్‌స్మిత దెబ్బకి ఆ పాట విషయంలో చిరంజీవి, రాఘవేంద్రరావు ఎన్నో అగచాట్లు పడ్డారట పాపం?