ధనుష్ సినిమాకు ఆ ఒక్క పేరుతో అంత బజ్‌ క్రియేట్‌

తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పటి వరకు తెలుగులో భారీ విజయాలను సొంతం చేసుకున్నదే లేదు.

అయినా కూడా ఆయన ప్రతి సినిమా ని తెలుగులో విడుదల చేసేందుకు ఎవరో ఒకరు ముందుకు వస్తూనే ఉన్నారు.

ఏదో ఒక సినిమా అయినా సక్సెస్ అయ్యి తెలుగులో మంచి మార్కెట్ ధనుష్ కి రాకుండా ఉంటుందా అంటూ కొందరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, తాజాగా నేనే వస్తున్నా అనే సినిమా తో ధనుష్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా కు ఆయన అన్నయ్య శ్రీ రాఘవ దర్శకత్వం వహించడం తో అంచనాలు భారీగా ఉన్నాయి.

విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించడం లో శ్రీ రాఘవ చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు.

అలాంటి సినిమా ను తెలుగులో చిన్నా చితక నిర్మాత తీసుకొస్తే పెద్దగా పట్టించుకునే వారు కాదు, కానీ మెగా నిర్మాత అల్లు అరవింద్ స్వయం గా ఈ సినిమా ను డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు.

గీత ఆర్ట్స్ లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యం లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

తెలుగు లో ఇప్పటి వరకు ధనుష్ నటించిన ఏ ఒక్క సినిమా కి కూడా రానంత బజ్ ఈ సినిమా కు వచ్చిందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ ప్రస్తుతం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.కేవలం ఒకే ఒక పేరు.

అది అల్లు అరవింద్ వల్ల ఈ సినిమా ను చూడాలి అనే ఉద్దేశం తో చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.

వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది.

దసరా సెలవులు ప్రారంభం కాబోతున్నాయి, పైగా సినిమా కు అల్లు అరవింద్ సమర్పకుడు ఈ రెండు కారణాల వల్ల మంచి వసూలు ఈ సినిమా కు నమోదయ్యే అవకాశం ఉందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లడ్డూ వివాదం : పవన్ కు వైసీపీ ఎంపీ ప్రశ్నలు