ఆ తమిళ రైతు కన్నుమూస్తే హీరోలంతా క్యూ కట్టారు.. ఇంతకు ఆ రైతు ఏం చేశాడో తెలిస్తే మీరు అతడిపై గౌరవం కలుగుతుంది
TeluguStop.com
నెల్ జయరామన్ ఒక సామాన్య రైతు.కాని ఆయన మరణిస్తే తమిళ ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు, తమిళ సినీ ప్రముఖులు ఎంతో మంది ఘన నివాళ్లు అర్పించారు.
ఎంతో మంది ప్రముఖులు ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.ఆయన చనిపోక ముందు కూడా ఎంతో మంది ఆయనకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలిచారు.
తమిళ హీరోలు ఆయన ఒక రియల్ హీరో అంటూ పొగడ్తలు కురిపించారు.నెల్ జయరామన్ వ్యవసాయంకు చేసిన సేవ అంతా ఇంతా కాదు.
అందుకే ఆయన్ను దేశం మొత్తం కూడా గుర్తించింది.ఎన్నో కేంద్ర ప్రభుత్వ అవార్డులు కూడా వచ్చాయి.
దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న నెల్ జయరామన్ క్యాన్సర్‌తో తుది శ్వాస విడిచారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
మరుగున పడిపోతున్న వ్యవసాయంను మళ్లీ తీసుకు రావాలని, ఎన్నో ఆహారపు పంటలను మళ్లీ తీసుకు వచ్చిన జయరామన్ గారు వ్యవసాయంలో విశేష కృషి చేశారు.
దాదాపుగా 174 రకాల ఆహార ధాన్యాలను ఆయన సేకరించారు.మనకు తెలిసినవి పది నుండి ఇరవై మాత్రమే ఉంటాయి.
కాని ఆయన 174 ఆహార ధాన్యాలు సేకరించడంతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
వాటిలో ఎక్కువ శాతం ఇప్పుడు ఆహారంగా వాడనే వాడటం లేదు.ఆరోగ్యంకు ఎంతో అద్బుతమైన ఆహార ధాన్యాలు వదిలేసి మనం తక్కువ పోషకాలు ఉన్న ఆహారంను తింటున్నాం అని జయరామన్ బాధపడే వారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
క్యాన్సర్‌తో జయరామన్ హాస్పిటల్‌లో జాయిన్ అయిన సమయంలో తమిళ హీరో శివ కార్తికేయన్ దగ్గరుండి మరీ అన్ని చూసుకున్నాడు.
హాస్పిటల్ ఖర్చులతో పాటు, ఆయనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని ఆ సమయంలో తీర్చాడు.
ఆయన చనిపోయిన సమయంలో తన సొంత ఖర్చులతో మృతదేహంను సొంత ప్రాంతంకు తరలించాడు.
దగ్గరుండి మరీ అంత్యక్రియలు జరిపాడు.తమిళ హీరోలు కమల్ హాసన్, విశాల్ లతో పాటు ఇంకా ప్రముఖ దర్శక నిర్మాతలు హీరోలు కూడా జయరామన్‌కు నివాళ్లు అర్పించారు.
తమిళనాడు రైతుగా దేశంనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్న నెల్ జయరామన్ గారికి ఇదే మా నివాళి అంటూ తమిళ స్టార్స్ నివాళ్లు సమర్పించారు.
తండేల్ క్లైమాక్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారా..?