సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన స్టార్ కమెడియన్ కొడుకు
TeluguStop.com
పుత్రుడు జన్మించినప్పుడు కాదు.ఆ పుత్రుడిని జనాలు పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం అని పెద్దలు చెప్తుంటారు.
ఏ తండ్రికి అయిన తన కొడుకు పెరిగి పెద్దయ్యాక కలిగే ఆనందం అంతా ఇంత కాదు.
ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా.తన కొడుకు తనకంటే మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని భావిస్తాడు.
తండ్రి కలను నిజం చేస్తే వారికి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది.
తాజా ఇలాంటి ఘటనే జరిగింది.సినిమాల్లో కమెడియన్ వేషాలు వేసి అతడి కుమారుడు సబ్ కలెక్టర్ గా ఎంపికై సంచలనం కలిగించాడు.
ఇంతకీ తను ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.చిన్ని జయంత్.
తెలుగు జనాలకు పెద్దగా పరిచయం లేదు.కానీ తమిళ జనాలు ఈయన బాగా తెలుసు.
స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న ఈయన పలువురు టాప్ హీరోల సినిమాల్లో నటించాడు.
శివాజీ గణేషన్, రజనీ కాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్, ప్రభు, కార్తీక్, అజిత్, విజయ్ సహా కోలీవుడ్ పెద్ద హీరోల సినిమాలు అన్నింటిలోనూ నటించాడు.
తాజాగా ఈయన పేరు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.దానికి కారణం ఆయన కొడుకు.
అతడి కొడుకు తాజాగా సబ్ కలెక్టర్ గా నియామకం అయ్యాడు. """/"/
చిన్ని జయంత్ కొడుకు శృతన్ జై నారాయణన్.
ఇతడు 2020లో ఐఏఎస్ పూర్తి చేశాడు.ఆలిండియా లెవల్లో 75వ ర్యాంకు సంపాదించాడు.
తాజాగా అతడు ట్యుటికోరన్ జిల్లాకు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
విద్య, జీవనోపాధి, మహిళా సాధికారత పెరుగుదలకు తను కష్టపడతానని చెప్పాడు.పేదరిక నిర్మూనలకు తగు చర్యలు తీసుకుంటానని చెప్పాడు.
ఆయన మాటలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.తండ్రికి తగిన కొడుకు అంటూ జనాలు ప్రశంసిస్తున్నారు.
పలువురు సినిమా పెద్దలు జయంత్ ను అభినందిస్తున్నారు.అటు జయంత్ ప్రస్తుతం విజయ్ సేతుపతి యాదుమ్ ఊరేఘెవరుమ్ కెలిర్ సినిమాలో నటిస్తున్నాడు.
మెగా ఫ్యామిలీని తొక్కేయాలని చూస్తుంది ఎవరు..?