విజయ్ ఆంటోని అన్నిసార్లు లవ్ లో ఫెయిల్ అయ్యారా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరో విజయ్ ఆంటోనీ( Tamil Hero Vijay Antony ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
విజయ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
విజయ్ ఆంటోనీ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
విజయ్ ఆంటోనీ కి తెలుగు ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.
విజయ్ నటించిన సినిమాలు తెలుగులోకి విడుదల అవ్వడంతో పాటు ఆయన సినిమాల కోసం ఇక్కడి ప్రేక్షకులూ ఎదురుచూస్తూ ఉంటారు.
"""/"/
అందులో భాగంగానే విజయ్ ఆంటోనీ నటించిన సలీమ్, అస్త్రం, బిచ్చగాడు వంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
మల్టీ టాలెంట్ ఉన్న ఈయనకు జెన్యూన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది.ఈ సందర్భంగా అభిమానులు ఆయన గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటారు.
ఈ క్రమంలో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో విజయ్ ఆంటోనీ తన గురించి ఒక విషయాన్ని తెలియజేశారు.
లవ్ స్టోరీ( Love Story ) విషయాల గురించి తెలిపారు.ఆయన మొత్తంగా ఐదుసార్లు లవ్ లో ఫెయిల్ అయ్యారట.
ఇక ఆరోసారి తన భార్యతోనే లవ్ లో పడ్డానని తెలిపారు విజయ్. """/"/
ఐదు సార్లు తన ప్రేమలో విఫలం కావడానికి కారణం తన సింప్లిసిటీ( Simplicity ), ప్లేన్ లైఫ్ స్టైల్ అని కూడా తెలిపారు.
తను మొదటి నుంచి అలాగే పెరిగానని, అమ్మాయిల విషయంలో ఇలా జరిగిందని ఆయన అన్నారు.
మొత్తానికి విజయ్ ఆంటోనీ తన లవ్ స్టోరీస్ గురించి ఓపెన్ కావడం ఇప్పుడంతా హాట్ టాపిక్ గ్గా మారింది.
ఇక విజయ్ ఆంటోనీ 2006లో ఫాతిమాను పెళ్లి చేసుకున్నారు.వీరికి ఇద్దరు కూతుర్లు.
కాగా గత ఏడాది ఆయన పెద్ద కూతురు మరణించిన విషయం తెలిసిందే.సూసైడ్ చేసుకొని మరణించింది.
శంకర్ భారతీయుడు 3 పరిస్థితి ఏంటి..?