మహేష్ బాబు గురించి సూర్య షాకింగ్ కామెంట్స్.. ఏం చేశారంటే?

శరవణన్ శివకుమార్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు గానీ హీరో సూర్య అంటే మాత్రం అందరికీ సుపరిచితమే.

ఒక భారతీయ నటుడు, నిర్మాత టెలివిజన్ వ్యాఖ్యాత.సూర్య .

మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, రెండు ఎడిసన్ అవార్డులు, సినీమా అవార్డు విజయ్ అవార్డులను అందుకున్నారు.

అంతే కాకుండా భారతీయ ప్రముఖుల సంపాదన ఆధారంగా సూర్యను ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఆరుసార్లు చేర్చారు.

సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా గురించి చెప్తూ.ఆయనతో ఇప్పటి వరకు దాదాపు 18 ఏళ్ల ప్రయాణం ఉందని సూర్య చెప్పారు.

ఇప్పటి వరకు ఆయన ఎన్నో మంచి సినిమాలకు ఎన్నో భారీ హిట్స్ ని కూడా అందించారని సూర్య తెలిపారు.

తను సీనీ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తన సినిమాలకు కూడా మంచి సాంగ్స్ ను అందించినట్టు ఆయన మరోసారి గుర్తు చేసుకున్నారు.

కార్తి చేసిన సినిమాలకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ని అందించి ఎన్నో విజయాలను అంది పుచ్చుకున్నారని సూర్య చెప్పారు.

అంతే కాకుండా తాను, యువన్ శంకర్ రాజా, నటుడు మహేశ్ బాబు ఒకే స్కూల్ లో చదువుకున్నామని సూర్య ఒకప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

"""/"/ అలా మా మధ్య చెప్పలేనన్ని మధుర స్మృతులు ఇప్పటికీ ఉన్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

అప్పటి నుంచి మా ముగ్గురి జర్నీ ఇలా కొనసాగుతూనే ఉందని ఆయన అన్నారు.

ఇక సినీ కెరియర్ లో ఇటు సూర్య, అటు మహేష్ బాబు వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.

ఇక సూర్య కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ఎంతో చురుకుగా పాల్గొంటారు.

ఈయన ఆగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు చదువులు చదివించి వారి బాధ్యతలను ఎంతో చక్కగా నెరవేరుస్తున్న సంగతి మనకు తెలిసిందే.

యూకే కొత్త కేబినెట్‌లో భారత సంతతి మహిళకు చోటు .. మంత్రుల లిస్ట్ ఇదే..?