భారతీయుడు 2 లో కమల్ హాసన్ కొడుకు పాత్ర లో తమిళ్ స్టార్ హీరో…
TeluguStop.com
కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా శంకర్ డైరెక్షన్ వస్తున్న భారతీయుడు 2 సినిమా( Bharateeyudu 2 ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
ఇక దీనికి తగ్గట్టుగానే ఈ సినిమా కి సంభందించిన ఇంట్రో వీడియోని రిలీజ్ చేయడం జరిగింది.
ఇక ఈ వీడియోలో భారతీయుడు సినిమా ఏ కాన్సెప్ట్ తో అయితే తెరకెక్కిందో ఈ సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఇలాంటి సమయంలో శంకర్( Shankar ) వరుసగా ప్లాప్ ల్లోఉన్నాడు.దాంతో కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో మంచి హిట్టు కొట్టి ఉన్నాడు.
"""/" /
కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే శంకర్ మళ్లీ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతాడు.
అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన విషయం కూడా రీసెంట్ గా బయటకు వచ్చింది అది ఏంటి అంటే ఈ సినిమాలో తమిళ్ హీరో అయిన కార్తీక్ ( Karthik ) కూడా ఒక కీలక పాత్ర లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే సిద్దార్థ్ ( Siddharth ) ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కార్తీక్ కూడా ఈ సినిమాలో ఒక మేజర్ రోల్ పోషిస్తున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది.
"""/" /
అది కూడా కమల్ హాసన్ కొడుకు పాత్రలో నటిస్తున్నాడు అనే టాక్ వస్తోంది.
ఇక ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.దాంతో కమల్ హాసన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాధిస్తుందని సినిమా యూనిట్ తో పాటు ఆయన అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ క్రమంలో ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.
ఈ సింపుల్ రెమెడీతో చెప్పండి హెయిర్ బ్రేకేజ్ కు బై బై..!