నోటి పూతా..? చింతచిగురుతో చెక్ పెట్టండిలా!

నోటి పూత.దీనినే మౌత్ అల్స‌ర్ అని అంటారు.

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రినీ ఏదో ఒక స‌మ‌యంలో ఈ సమ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

నాలుక, దవడ లోపల, పెదవుల లోపల, చిగుళ్లపై ఈ పుండ్లు ఏర్ప‌డ‌తాయి.ఈ నోటి పుండ్లు ఎలాంటి హాని క‌లిగించ‌క‌పోయిన‌ప్ప‌టికీ.

ఏమ‌న్న తిన్నా, తాగినా చివ‌ర‌కు మాట్లాడినా తీవ్రమైన నొప్పి పుడుతూ ఉంటాయి.అందుకే నోటి పూత‌ను త్వ‌ర‌గా త‌గ్గించుకునేందుకు నానా ప్రయ‌త్నాలు చేస్తుంటారు.

ఎన్నో మందులు వేసుకుంటారు.అయితే నోటి పూత‌ను త్వ‌ర‌గా నివారించ‌డంలో చింత చిగురు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

లేత చింత ఆకులను చింత చిగురు అంటార‌న్న సంగ‌తి తెలిసిందే.రుచికి పుల్లగా ఉండే ఈ చింత చిగురులో ఎన్నో పోష‌క విలువ‌లు దాగి ఉంటాయి.

అందుకే చింత చిగురును డైట్‌లో చేర్చుకుంటే ఎన్నో జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు.

"""/"/ ముఖ్యంగా నోటి పూత స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారికి చింత చిగురు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

చింత చిగురును తీసుకుని నీటిలో వేసి బాగా మ‌రిగించి.వ‌డ‌బోసుకోవాలి.

ఇప్పుడు ఈ వాట‌ర్ కాస్త గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత నోట్లో వేసుకుని పుక్క‌లించాలి.

ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తే.చింత చిగురులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వేగంగా నోటి పూత‌ను త‌గ్గిస్తాయి.

ఇక చింత చిగురుతో మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.చింత చిగురును ఆహారంలో చేర్చుకుంటే.

ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.కడుపులో నులి పురుగులు నాశ‌నం అవుతాయి.

థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది.కంటి చూపు మెరుగు ప‌డుతుంది.

ఎముక‌లు, దంతాలు దృఢంగా మార‌తాయి.గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది.