డా‌ర్క్‌ స‌ర్కిల్స్‌కు చెక్ పెట్టే చింత‌పండు.. ఎలాగంటే?

డా‌ర్క్ స‌ర్కిల్స్ లేదా న‌ల్ల‌టి వ‌ల‌యాలు.చాలా మంది ఈ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.

క‌ళ్ల చుట్టు న‌ల్ల‌గా ఏర్ప‌డ‌ట‌మే డా‌ర్క్ స‌ర్కిల్స్‌.ఆహార‌పు అల‌వాట్లు, నిద్ర స‌రిగ్గా లేక‌పోవ‌డం, కాస్మొటిక్స్ ఉపయోగించడం, వ‌య‌సు పైప‌డ‌టం, ఒత్తిడి, డీహైడ్రేషన్, హర్మోన్ల మార్పులు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌ళ్ల చుట్టు డార్క్ స‌ర్కిల్స్ ఏర్ప‌డ‌తాయి.

ఇక వీటిని త‌గ్గించుకునేందుకు కొంద‌రు ఏవేవో ప్ర‌యోగాలు చేసి.విఫ‌ల‌మ‌వుతుంటారు.

కానీ, డార్క్ స‌ర్కిల్స్ నివారించ‌డంలో చింత‌పండు అద్భుతంగా స‌హాప‌డుతుంది.మ‌రి చింత‌పండును ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా కొద్దిగా చింత‌పండును నీటిలో నాన‌బెట్టుకుని.ఒక అర గంట త‌ర్వాత పేస్ట్ చేసుకోవాలి.

ఆ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మ రసం వేసి మిక్స్ బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల చుట్టు అప్లై చేసి.బాగా ఆరిన త‌ర్వాత కోల్డ్ వాట‌ర్‌తో క‌ళ్ల‌ను శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల డార్క్ స‌ర్కిల్స్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

"""/" / రెండొవ‌ది.చింత‌పండును వాట‌ర్‌లో నాన‌బెట్టి మొత్త‌గా పేస్ట్‌లో చేసుకోవాలి.

ఆ పేస్ట్‌లో కొద్దిగా గంధం పొడి వేసి బాగా క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల చుట్టు అప్లై చేసి.

ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.ఆ త‌ర్వాత నీటితో క‌ళ్ల‌ను క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేయ‌డం వ‌ల్ల న‌ల్ల‌టి వ‌ల‌యాలు త‌గ్గుతాయి.

ఇక మూడొవ‌ది.నాన‌బెట్టి పేస్ట్ చేసుకున్న చింత‌పండులో చిటికెడు ప‌సుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల చుట్టు అప్లై చేసి.పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల కూడా క‌ళ్ల చుట్టు ఉన్న న‌ల్ల‌టి వ‌ల‌యాలు క్ర‌మంగా పోతాయి.

Most Happening Samyuktha Menon Bollywood Debut Will Happen Very Soon