చేతులను మృదువగా మార్చే చింతపండు..ఎలాగంటే?
TeluguStop.com
సాధారణంగా కొందరికి శరీరం ఎంత తెల్లగా ఉన్నాచేతులు మాత్రం డార్క్‌గా, రఫ్‌గా ఉంటాయి.
ఈ క్రమంలోనే చేతులను మృదువుగా మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.ఖరీదైన క్రీములు, మాయిశ్చరైజర్లు, ఆయిల్స్ వాడుతుంటారు.
అయితే ఎలాంటి ఖర్చు లేకుండా అందరి వంటింట్లో ఉండే చింత పండుతో కూడా చేతులును మృదువుగా మార్చుకోవచ్చు.
మరి చింత పండును చేతులకు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా వాటర్‌లో చింతపండును నాన బెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొద్దిగా బేకింగ్ సోడా, నిమ్మ రసం వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు డ్రైఅవ్వనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే చేతులు మృదువుగా, వైట్‌గా మారతాయి.
"""/" /</
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్లు చింత పండు పేస్ట్, ఒక స్పూన్ షుగర్ మరియు చిటికెడు పసుపు వేసుకుని కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు పూసి మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకోవాలి.ఆ తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే.డెడ్ స్కిన్ సెల్స్ పోయి చేతులు కోమలంగా తయారవుతాయి.
ఇక ఒక గిన్నెలో రెండు స్పూన్ల చింత పండు గుజ్జు, ఒక స్పూన్ల బియ్యం పిండి, అర స్పూన్ రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చేతులకు బాగా రుద్దుకుని కాస్త ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
వారంలో నాలుగు లేదా ఐదు సార్లు ఇలా చేసినా కూడా చేతులు మృదువుగా, కాంతి వంతంగా మారతాయి.
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్