చింతపండుతో ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది..తెలుసా?
TeluguStop.com
ఇటీవల కాలంలో హెయిర్ ఫాల్ అన్నది పెద్ద సమస్యగా మారింది.చాలా మంది ఈ సమస్యతో సతమతం అవుతున్నారు.
హెయిర్ ఫాల్‌ను అడ్డుకోవడం కోసం వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.
? అయితే అస్సలు బాధపడకండి.ఎందుకంటే, మీ వంటింట్లో లభించే చింతపండు హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
చింతపండులో ఉండే ప్రత్యేక సుగుణాలు జుట్టు కుదుళ్లకు చక్కటి పోషణను అందించి హెయిర్ ఫాల్ ను నివారిస్తుంది.
మరి ఇంతకీ చింతపండును జుట్టుకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా నిమ్మకాయంత చింతపండును తీసుకుని గిన్నెలో వేసి, ఒక కప్పు వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
ఉదయాన్నే నానబెట్టుకున్న చింతపండును వాటర్‌తో సహా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల కలబంద జెల్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గి.ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
"""/"/
అలాగే చుండ్రు సమస్యను వదిలించడంలోనూ చింతపండు ఉపయోగపడుతుంది.చింతపండును నానబెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్‌లో రెండు, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.షవర్ క్యాప్ ను ధరించాలి.
నలబై నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.ఇలా చేస్తే చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందొచ్చు.
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?