ప్రియుడితో తమన్నా బ్రేకప్ కన్ఫర్మ్ అయినట్టేనా…. ఆ వీడియోతో క్లారిటీ ఇచ్చారా?
TeluguStop.com
సినీ నటి తమన్నా(Thamanna) తన ప్రియుడు విజయ్ వర్మతో(Vijay Varma) బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా తమన్నా తన ప్రియుడుతో బ్రేకప్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది.తాజాగా తమన్నాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఈ వీడియో తన ప్రియుడితో బ్రేకప్ కన్ఫర్మ్ అని చెప్పకనే చెబుతోంది.
ప్రస్తుతం ముంబైలో నవరాత్రులు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నవరాత్రులలో భాగంగా మాతా కీ చౌకీ చేస్తారు.
"""/" /
ఈ క్రమంలోనే తమన్నా ఇంట్లో కూడా మాతా కీ చౌకీ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.
పూజ పూర్యయ్యాక తమన్నా తన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
తమన్నా ఫ్రెండ్, రవీనా టాండన్ కూతురు రషా తదానీ కూడా హాజరై ఇద్దరూ కలిసి డ్యాన్సులేశారు.
అందుకు సంబంధించిన వీడియోలను కూడా తమన్న షేర్ చేశారు. """/" /
తమన్నా ,రషా ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో ఇటీవల రషా ఇంట్లో ఏర్పాటు చేసిన హోళీ (Holi) వేడుకలలో తమన్నా పాల్గొని సందడి చేశారు అయితే ఈ వేడుకలకు తమన్నా ప్రియుడు విజయ్ వర్మ కూడా హాజరయ్యారు కానీ ఇద్దరు ఒకేసారి కాకుండా వేరువేరు సమయాలలో హాజరయ్యారు.
ఇక తాజాగా తమన్నా ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ నవరాత్రి వేడుకలలో కూడా విజయ్ వర్మ ఎక్కడ కనిపించలేదు.
దీంతో బాలీవుడ్ లో వీరి బ్రేకప్(Break Up) పై వస్తున్న వార్తలు నిజమేననిపిస్తోంది.
ఇలా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ ఈ విషయాన్ని మాత్రం బయటకు వెల్లడించలేదని సమాచారం.
ఇక ప్రస్తుతం తమన్న విజయ్ వర్మ ఇద్దరు కూడా వారి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు
.