రెండుసార్లు నా హృదయం ముక్కలైంది.. రిలేషన్ షిప్ పై తమన్నా సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నాకు( Tamannaah ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

ఈ మధ్య కాలంలో తమన్నా తెలుగులో ఎక్కువ సినిమాలలో నటించకపోయినా ఇతర భాషల్లోని ప్రాజెక్ట్ లతో మాత్రం బిజీగా ఉన్నారు.

స్త్రీ2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేసిన తమన్నా ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 750 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి తమన్నా మాట్లాడుతూ రెండుసార్లు నా హృదయం ముక్కలైంది అంటూ ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా హృదయం ముక్కలైన సమయంలో నాకెంతో బాధగా అనిపించిందని తమన్నా తెలిపారు.టీనేజ్ లో ఉన్న సమయంలోనే తొలి హార్ట్ బ్రేక్ ను ఎదుర్కొన్నానని ఆమె అన్నారు.

"""/" / ఒక వ్యక్తి కోసం నా లైఫ్ ను వదులుకోవడం నాకు నచ్చలేదని తమన్నా చెప్పుకొచ్చారు.

లైఫ్ లో ఏదో సాధించాలని కొత్త విషయాలు అన్వేషించాలని నా భావన అని ఆమె పేర్కొన్నారు.

ఆ కారణంతో ఆ బంధం నిలవలేదని తమన్నా తెలిపారు.ఆ తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్ లో ఉన్నానని అయితే అతడు నాకు సెట్ కాడనిపించిందని తమన్నా వెల్లడించారు.

"""/" / ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పేవాళ్లు అంటే నాకు ఇష్టం ఉండదని అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగిస్తే ప్రమాదం అని అర్థమైందని తమన్నా పేర్కొన్నారు.

అలా అది కూడా ముగిసిపోయిందని తమన్నా వెల్లడించారు.తమన్నా చెప్పిన ఈ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తమన్నా ప్రస్తుతం విజయ్ వర్మతో ( Vijay Varm)ప్రేమలో ఉండగా పెళ్లికి సంబంధించిన శుభవార్త ఎప్పుడు చెబుతారో చూడాలి.

యూపీఐ ఎక్కువగా వాడుతుంటే ఇలా చేయండి.. లేకపోతే మీ ఎకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం