తమన్నా ఆశలన్నీ ఆ రెంటిపైనే.. కెరీర్ సాగేది ఎలా?
TeluguStop.com
మిల్కీ బ్యూటీ హ్యాపీ డేస్ సినిమా( Happy Days ) మొదలుకుని మొన్నటి వరకు ఎంతో స్పీడ్ గా సినిమా లు చేస్తూ ఏడాదికి నాలుగు అయిదు సినిమా లతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అంతగా సినిమా లు చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా( Tamannah ) కెరీర్ చరమాంకం కు వచ్చిందా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది.
ఎందుకంటే ఆమె ఈ మధ్య కాలంలో ఆఫర్లు ఎక్కువ దక్కించుకోలేక పోతుంది.అంతే కాకుండా వచ్చిన ఆఫర్లు కూడా యంగ్ హీరోల సినిమా ల ఆఫర్ లు కాకుండా చిన్న సినిమాల ఆఫర్లు లేదంటే సీనియర్ హీరోల ఆఫర్ లు.
తాజాగా ఈ అమ్మడు అదృష్టం కొద్ది తెలుగు లో చిరంజీవి భోళా శంకర్ సినిమా లో నటించగా.
తమిళం లో రజినీకాంత్ సినిమా జైలర్( Jailer ) లో హీరోయిన్ గా నటించింది.
"""/"/
ఈ రెండు సినిమా లు కూడా ఒకే సమయం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ఈ రెండు సినిమా లు కనుక ఈ అమ్మడికి సక్సెస్ ను తెచ్చి పెడితే కచ్చితంగా మంచి కెరీర్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఒక వేళ ఇండస్ట్రీ లో ఈ అమ్మడు కొన్నాళ్లు కొనసాగితే మాత్రం మరిన్ని సినిమా ల్లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తమన్నా ప్రస్తుతం చేస్తున్న జైలర్, భోళా శంకర్( Bhola Shankar ) సినిమా లు భారీ ఎత్తున విడుదల కాబోతున్న నేపథ్యం లో ఈమె తప్పకుండా ముందు ముందు మరిన్ని సినిమా ల్లో అవకాశం దక్కించుకుంటుందని ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
"""/"/
తమన్నా గతంలో చేసిన సినిమా లు సూపర్ హిట్ అయిన నేపథ్యం లో ఈ సినిమా లు భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తమన్నా ఐటం సాంగ్స్( Tamanna Item Songs ) చేసిన సినిమా లు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.
అందుకే ఈ రెండు సినిమా లు హిట్ అయితే తమన్నా నుండి ముందు ముందు మరిన్ని ఐటం సాంగ్స ను కూడా ఆశించవచ్చు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో అయిదు ఆరు సంవత్సరాల పాటు తమన్నా తన అందాలతో మెప్పించడం ఖాయం.
ఏసు భాయిగా రాబోతున్న నటి రష్మిక మందన్న….మరో హిట్ గ్యారెంటీ?