దాని కోసం రెండు నెలలు అంటోన్న మిల్కీ

టాలీవుడ్ అందాల భామ తమన్నా ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

హీరోయిన్ పాత్రలతో పాటు అడపాదడపా ఐటెం సాంగ్స్‌లోనూ తమ్మూ తన మార్క్‌ను చూపిస్తోంది.

ఇటీవల మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించిన ఈ బ్యూటీ, ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్ సరసన ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

దర్శకుడు సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా కబడ్డీ కోచ్‌లుగా కనిపిస్తారు.

అయితే ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కూడా ఆడనుంది.దీని కోసం ఏకంగా రెండు నెలల ట్రెయినింగ్ తీసుకుంటుందట.

తన కలలో కూడా కబడ్డీ ఆట ఆడుతానని అనుకోలేదట ఈ బ్యూటీ.ఇప్పుడు సీటీమార్ చిత్రం కోసం ఇలా చెమటోడుస్తుండటం తనకు సంతోషంగా ఉందని ఆమె అంటోంది.

తమన్నా తన పాత్రల కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

ఇప్పుడు కబడ్డీ ఆటను నేర్చుకోవడానికి ఆమె చూపిస్తున్న డెడికేషన్‌కు పలువురు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది ఈ పాల బుగ్గల సుందరి.

ఆ రీజన్ వల్లే నాకు సౌత్ లో ఆఫర్లు తగ్గాయి.. ఇలియానా షాకింగ్ కామెంట్స్ వైరల్!