టాలెంట్ ఒక్కటే మనల్ని స్టార్స్ ని చేస్తుంది అంటున్న తమన్నా
TeluguStop.com
గత కొంత కాలంలో చిత్ర పరిశ్రమలో నెపోటిజం గొడవ జరుగుతుంది.సినిమా ఇండస్ట్రీలో బంధుప్రీతి కారణంగా చాలా మంది కొత్త నటుల భవిష్యత్తు నాశనం అవుతుందని పలువురు సెలబ్రిటీలు ఆరోపణలు చేస్తున్నారు.
అలాగే తమ జీవితంలో నెపోటిజం కారణంగా చాలా అవకాశాలు కోల్పోయామని సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు.
ఇక కంగనా రనౌత్ ఈ నెపోటిజం కాంపైన్ లీడ్ చేస్తూ వస్తుంది.సెలబ్రిటీల కుటుంబాల నుంచి వస్తున్న వారసుల కారణంగా టాలెంట్ ఉన్న చాలా మంది కొత్త వాళ్ళు అవకాశాలు కోల్పోతున్నారనే మాట గట్టిగా వినిపిస్తుంది.
ఇది కేవలం బాలీవుడ్ లోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలలో ఉంది.ఇదిలా ఉంటే ఈ నెపోటిజం అనే మాటని చాలా స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన సెలబ్రిటీలలో కొంత మంది సమర్ధించడం లేదు.
వీరిలో తమన్నా కూడా వచ్చి చేరింది.సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉందనే మాట తాను అంగీకరించనని తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
సినిమా ఇండస్ట్రీలో మనకంటూ ఎవరూ లేకపోయినా కూడా సక్సెస్ అవ్వచ్చని అంటోంది.టాలెంట్ ఉండాలే కానీ ఇక్కడ ఎదగడానికి బోలెడన్ని అవకాశాలు వున్నాయి.
మన వెనుక ఎవరో ఉంటేనే ఇక్కడ సక్సెస్ అవుతామన్నది నిజం కాదు.నేను, కాజల్, సమంత మేమంతా అలా ఎవరూ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వాళ్లమే కదా.
టాలెంట్, కృషి వుంటే సక్సెస్ అదే వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.తమన్నా చెప్పినట్లు చాలా మంది హీరోయిన్స్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్స్ ఈ రోజు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే ఎవరో సహకారం ఉంటేనే స్టార్స్ అవుతారు అనేది హీరోయిన్స్ విషయంలో ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో అంతగా పని చేయదని వీరి కెరియర్ ఉదాహరణగా నిలుస్తుంది.
సమ్మర్ లో చికెన్ తింటున్నారా.. అయితే జాగ్రత్త!