నన్ను ఎవరైనా అలా పిలిస్తే చాలా ఇష్టం.. హీరోయిన్ తమన్నా క్రేజీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా( Tamanna ) గురించి మనందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు దాటిపోయిన కూడా ఇప్పటికీ అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.

అంతే కాకుండా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది.ఇది ఇలా ఉంటే తమన్నా ప్రస్తుతం వెబ్ సిరీస్ లు ఐటెం సాంగ్స్ అలాగే హీరోయిన్గా నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

హిందీ, తెలుగు, తమిళం తదితర భాషల్లో పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకు మెప్పిస్తోంది.

మధ్య మధ్యలో ప్రత్యేక పాటల్లో నటిస్తున్నా అవి ఆమె కెరీర్‌కు ప్లస్‌ అయ్యాయే కానీ ఎలాంటి నష్టాన్ని తీసుకురాలేదు.

"""/" / కాగా ఈ అమ్మడు బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో( Vijay Varma ) ప్రేమలో పడిన తర్వాత కాస్త అవకాశాలు తగ్గినా ఆమె క్రేజ్‌ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.

ఇందుకు కారణం ఆమె ఇప్పటికీ ఐటమ్‌ సాంగ్స్‌ కు స్పెషలిస్ట్‌ అనిపించుకోవడమే.కాగా తమన్నా హిందీలో ప్రత్యేక పాటలో నటించిన స్త్రీ చిత్రం కానీ, తమిళంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన జైలర్‌( Jailer Movie ) చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ తో పాటు గెస్ట్‌ గా నటించిన పాత్ర కానీ ఆ చిత్రాల విజయాలకు కొమ్ము కాశాయని చెప్పాలి.

ఇకపోతే అభిమానులు ఆమెను ప్రేమగా మిల్క్ బ్యూటీ అని పిలుస్తారు అన్న విషయం తెలిసిందే.

"""/" / అయితే ఇటీవల ఒక సమావేశంలో తమన్నా మాట్లాడుతూ.మిల్కీ బ్యూటీ( Milky Beauty ) అనే పట్టం తనకు మొదట్లో అభిమానులు ఇచ్చారని గుర్తు చేసుకుంది.

ఆ తర్వాత మీడియా దాన్ని ఎక్కువగా వాడటంతో ఆ పదం చాలామందికి దగ్గరైంది.

దానివల్ల తాను ఇబ్బందులు పడ్డానని అనుకున్నారు.కానీ అందులో ఎలాంటి నిజం లేదు.

అలా పిలుస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అంటూ నవ్వింది.అదేవిధంగా అందంగా ఉండడంతోనే మంచి అవకాశాలు తనకు రాలేదని గుర్తుచేసింది తమన్నా.

తాము పనిచేస్తోంది రంగుల ప్రపంచంలో అని, ఇక్కడ అందుకు తగ్గట్టుగా అందంగా ఉండాలని, అందుకోసమే తాను నిరంతరం ప్రయత్నిస్తున్నానని తమన్నా తెలిపింది.

ఇకపోతే తమన్నా నటించిన లేటెస్ట్ సినిమా ఓదెల 2.( Odela 2 ) ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో సక్సెస్ఫుల్గా ప్రసారం అవుతోంది.