బాలయ్య ‘NBK109’ కోసం ఆ హీరోయిన్.. మరో ఆఫర్ కొట్టేసిన లక్కీ బ్యూటీ!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Actor Balakrishna ) మొన్న పుట్టిన రోజు నాడు మరో కొత్త మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఆ రోజు ఫ్యాన్స్ కు అదిరిపోయే లెవల్ లో ట్రీట్ ఇచ్చాడు.ఎప్పటి కంటే ఈసారి ట్రీట్ మరింత అదిరిపోయేలా ఇచ్చి నందమూరి ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తాడు.

ప్రజెంట్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో బాలకృష్ణ భగవంత్ కేసరి( Bhagwant Kesari ) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

బర్త్ డే రోజే ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ రెండు రిలీజ్ చేసి వేరే లెవల్ ట్రీట్ ఇచ్చాడు.

ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల బాలయ్య కూతురు రోల్ లో నటిస్తుంది.

దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. """/" / ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత నటించబోయే సినిమాను కూడా బర్త్ డే రోజు డైరెక్ట్ లాంచ్ చేసి ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇచ్చాడు.

బాలయ్య తన 109వ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేయనున్నాడు.ఇటీవలే మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య వంటి సక్సెస్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ బాలయ్యతో ఎలాంటి పవర్ ఫుల్ సబ్జెక్ట్ తీస్తాడో ఎదురు చూడాల్సిందే.

"""/" / అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో బాలయ్య సరసన తమన్నా ( Tamannaah )ను ఫిక్స్ చేసినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం ఫస్ట్ గా తమన్నా పేరునే పరిశీలిస్తున్నారని ఈమె ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే అని టాక్.

ఇక ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య వ్యవహరించ బోతున్నారు.

యూకే: ఇంట్లోకి దూరి మహిళ బట్టలుతికి వంట చేసిన దొంగ.. లాస్ట్ ట్విస్ట్..?