తమన్నా ఏంటీ దూకుడు..!
TeluguStop.com

మిల్కీ బ్యూటీ తమన్నా తెరంగేట్రం చేసి రెండు దశాబ్ధాలు అవుతున్నా సరే ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తుంది.


సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో సత్తా చాటుతుంది తమన్నా.


ఈమధ్యనే గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమ్మడు ప్రస్తుతం మరో రెండు భారీ సినిమాల్లో నటిస్తుంది.
అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ కాగా.మరొకటి సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్.
జైలర్ లో తమన్నా నటిస్తుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా చిత్రయూనిట్ నుంచి అఫీషియల్ కన్ ఫర్మేషన్ రాలేదు.
"""/"/
ఇక లేటెస్ట్ గా జైలర్ సినిమా నుంచి తమన్నా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది తమన్నా.
లాస్ట్ ఇయర్ బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి సినిమాల్లో నటించిన తమన్నా ప్రస్తుతం బోలే చుడియన్, బాంద్రా సినిమాల్లో నటిస్తుంది.
ఈ సినిమాలతో అమ్మడు మరోసారి తన మార్క్ చూపించాలని చూస్తుంది.తమన్నా దూకుడు చూసి మిగతా హీరోయిన్స్ అంతా షాక్ అవుతున్నారు.
ఇదే కాదు మరో రెండు ప్రాజెక్ట్ లు కూడా అమ్మడి చేతిలో డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయట.
మొత్తానికి మిల్కీ బ్యూటీ మామూలు ఫాం లో లేదని తెలుస్తుంది.
చందు మొండేటి సూర్య కాంబో ఫిక్స్ అయినట్లేనా..?