వావ్ అనిపించేస్తున్న తమన్నా..!

టాలీవుడ్ లో ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా సరే మిల్కీ బ్యూటీ తమన్నాని ఎవరు ఏం చేయలేరని చెప్పొచ్చు.

ఎప్పుడో 2005 లో వచ్చిన శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా 17 ఏళ్లు అవుతున్నా సరే ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తుంది.

యువ హీరోలు, స్టార్ హీరోలే కాదు సీనియర్ హీరోల సరసన నటిస్తూ కెరియర్ వెల్లదీస్తుంది అమ్మడు.

ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా తన గ్లామర్ షోతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

సినిమాల్లో గ్లామర్ షోకి నో చెప్పని తమన్నా ప్రైవేట్ ఫోటో షూట్స్ లో కూడా రెచ్చిపోతుంది.

లేటెస్ట్ గా తమన్నా బ్లూ అవుట్ ఫిట్ తో ఇచ్చిన హాట్ స్టిల్ వావ్ అనిపించేలా చేస్తుంది.

అందం అమ్మాయైతే నువ్వేనేమో అంటూ సాంగ్ పాడినట్టుగా తమన్నా అందాలని చూసి ఎవరైనా సరే వెర్రెక్కిపోవాల్సిందే.

ప్రస్తుతం వెంకటేష్ తో ఎఫ్3 సినిమా చేస్తున్న తమన్నా సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తుంది.

ఈ రెండు సినిమాలతో కెరియర్ మళ్లీ దూసుకెళ్లాలని చూస్తుంది. ఇవే కాకుండా తెలుగులో మరో స్టార్ సినిమాతో పాటుగా యువ హీరోల సినిమాలు రెండు లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతున్నా తమన్నా క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు.

బతికున్న పామును కరకరా నములుతూ తినేసిన సౌత్ కొరియా అమ్మాయి.. వీడియో వైరల్..