కేన్స్ నుండి బీచ్ లో వాలిపోయిన మిల్కీ బ్యూటీ.. రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయిందట!

కేన్స్ 2022 అట్టహాసంగా జరిగింది.ఈ వేడుకల్లో ఇండియన్ భామలు కూడా తమ హవా చూపించారు.

ఇందులో మిల్కీ బ్యూటీ మెరుపులు కేన్స్ ఉత్సవాల్లో హైలెట్ గా నిలిచాయి.ఎంత మంది ఉన్న పాలమీగడ లాంటి ఈ భామ అందాలు అక్కడి వారికీ కనువిందు చేసాయి.

ఈమె మంచి ప్రిపరేషన్స్ తో కేన్స్ లో అడుగు పెట్టి చాలా మంది మనసులను దోచుకుంది.

సౌత్ ఇండియా లోనే హాటెస్ట్ బ్యూటీగా హాలీవుడ్ ప్రముఖుల కళ్ళల్లో పడింది.ఇక అక్కడి వేడుకల్లో అలిసిన తమన్నా నేరుగా థాయిల్యాండ్ లో ల్యాండ్ అయ్యింది.

ఈమె అక్కడ రెస్ట్ తీసుకోవడానికి వచ్చిందట.ఈ విరామం తనకు చాలా అవసరం అని తమన్నా భావించింది.

తాజాగా తమన్నా తన ఇంస్టాగ్రామ్ లో థాయ్ ల్యాండ్ నుండి కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫొటోల్లో ఈమె చాలా అందంగా ఆకర్షణీయంగా, స్టైలిష్ గా కనిపించింది.ఈ ఫొటోలతో పాటు ''మిస్ బి అండ్ హర్ బీచ్ లైఫ్ అని క్యాప్ష్ణ ఇచ్చింది.

కేన్స్ లో రకరకాల డిజైనర్ దుస్తుల్లో మెరిపించి ఈమె ఈ ఫొటోల్లో మాత్రం హై -వెస్ట్ రిప్డ్ జీన్స్ తో సింపుల్ టాప్ తో కనిపించింది.

ఈ ఫోటోలు అభిమానులను అలరిస్తున్నాయి.తమన్నా భాటియా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపు తుంది.

మధ్యలో కొద్దిగా అవకాశాలు తగ్గిన కూడా మళ్ళీ ఉపందుకుని ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకు పోతుంది.

"""/"/ తమన్నా ఇటీవల గుర్తుందా శీతాకాలం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఇక ఇప్పుడు ఎఫ్ 3 సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్ లుగా నటించారు.

ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దీంతో పాటు చిరు సినిమాలో కూడా నటిస్తుంది.