ఆ వివాదంపై హైకోర్టు లో ప్రభాస్ పిటిషన్ ..?

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా.గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ ఇప్పడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు.

కొద్దీ రోజుల క్రితం.ప్రభాస్ ఇంటిని అధికారులు స్వాధీనం చేసుకోవడానికి నోటీస్ జారీ చేశారు.

దీంతో ఇదో పెద్ద సంచలనం అయ్యింది .ఇంతకీ విషయం ఏంటి అంటే.

హైదరాబాద్ రాయదుర్గంలోని ఒక సర్వే నెంబర్ లో ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా సుప్రింకోర్టు ప్రకటించింది.

ఆ భూమిలో ఉన్న ఇళ్లను కూడా కూల్చివేశారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే అక్కడే ప్రభాస్ కు కూడా ఓ అతిధి గృహం కూడా ఉండడంతో ఇది పెద్ద వార్త అయ్యింది.

ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు అదికారులు నోటీస్ జారీ చేశారు.దీనిపై ప్రభాస్ హైకోర్టుకు వెళ్తున్నట్టు సమాచారం.

ఇది ప్రభుత్వ భూమి కాదని, అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకుని నోటీసు ఇచ్చారని ప్రభాస్ భావిస్తున్నాడు.

అందుకే ఇప్పుడు కోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు.