చిరంజీవితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవ్వదు.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లపై తీసుకున్న నిర్ణయం పట్ల సినీ ఇండస్ట్రీ మొత్తం ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తోంది.

ఈ క్రమంలోనే సినిమా టికెట్ల రేట్లను దారుణంగా తగ్గించడం వల్ల ఇండస్ట్రీ ఎంతో నష్టపోవాల్సి ఉంటుందని టికెట్ల రేట్లను పెంచే చర్యలు తీసుకోవాలని ఏఏపీ ప్రభుత్వాన్ని సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎన్నోసార్లు వారి నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ముందు ఉంచారు.

ఇలా ఈ వ్యవహారం గురించి ఎన్నో సార్లు ఏపీ ప్రభుత్వానికి విన్నపం చేసిన ఏపీ ప్రభుత్వం మాత్రం సినిమా టిక్కెట్ల రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ సమస్యల గురించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడడం కోసం ఆయనను ప్రత్యేకంగా విజయవాడ లోని ఆయన నివాసంలో కలిసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సమావేశం పై కొందరు సానుకూలంగా వ్యవహరించగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ నేత నారాయణ మెగాస్టార్ చిరంజీవి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

"""/" / ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కేవలం చిరంజీవి ఒక్కరు మాట్లాడితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరకిందని, ఉద్యోగుల సమస్యలను ఏపీ ప్రభుత్వం విభజించు.

పాలించు అనే విధానాన్ని అనుసరిస్తోందని సినీ పరిశ్రమలో కూడా అలాంటి విధానాన్ని అనుసరిస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. """/" / సమస్య సినిమా ఇండస్ట్రీ కనుక కేవలం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాకుండా ఫిలిం ఛాంబర్, నిర్మాత మండలికి సంబంధించిన వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి చర్చలు జరిపితేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని నారాయణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

గతంలో సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవి ఒంటరిగా కలవడమే ఆయన చేసిన పొరపాటని అసలు ఒంటరిగా కలవాల్సిన అవసరం ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించారు.

పుష్ప 2 మూవీ ఈ ఇయర్ ను గ్రాండ్ గా ఎండ్ చేస్తుందా..?