కార్తీక దీపం ముగింపుపై చర్చ.. ఇదెక్కడి మాస్ రా మావ

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.గత కొంత కాలం నుండి ఈ సీరియల్ బుల్లి తెర పై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

కేవలం సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ కు బాగా ఫిదా అయ్యారు.

ముఖ్యంగా ఇందులో నటించే పాత్రలు మాత్రం అందరికీ బాగా దగ్గరయ్యాయి.ఇక ఈ సీరియల్ 2017 లో ప్రారంభం కాగా అంతకుముందే మలయాళంలో ఈ సీరియల్ ప్రారంభమైంది.

ఇక తెలుగు తర్వాత కన్నడ, తమిళ, మరాఠి భాషలో కూడా ప్రారంభమైంది.మొత్తానికి ఈ సీరియల్ ప్రతి భాషలో ఓ సెన్సేషనల్ క్రియేట్ చేసుకుంది.

ఇక ఈ సీరియల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ సీరియల్ కు ఎప్పుడు ముగింపు ఉంటుందా అని తెగ ఎదురుచూస్తున్నారు.

"""/"/ మధ్య మధ్యలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ఈ సీరియల్ ను సాగదీయడం తో ప్రేక్షకులు ఈ సీరియల్ ను చూడటానికి అంతగా ఇష్టం చూపించడం లేదని తెలుస్తుంది.

డాక్టర్ బాబు, వంటలక్క కలిసి ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని బాగా ఎదురుచూస్తున్నారు కార్తీకదీపం అభిమానులు.

మొత్తానికి ఏదో ఒక సమయంలో వీరు కలవటంతో మధ్యలో మోనిత ద్వారా సునామి సృష్టిస్తున్నాడు డైరెక్టర్.

"""/"/ దీంతో ప్రేక్షకులకు ఈ సీరియల్ పై దృష్టి మళ్ళింది.కానీ ఎప్పుడెప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందా అని చూడకుండా ఉండట్లేరు ప్రేక్షకులు.

కానీ గత కొన్ని రోజుల నుండి ఈ సీరియల్ శుభం కార్డు పలుకుతుందని తెగ చర్చలు చేస్తున్నారు ప్రేక్షకులు.

డాక్టర్ బాబు, వంటలక్క మధ్య మోనిత పోరు తగ్గడానికి దగ్గరలో ఉందని ఎలాగైనా ఈ సీరియల్ త్వరలో ముగియనుంది అనుకుంటున్నారు.

దీంతో తాజాగా ఓ పోస్టు ద్వారా కూడా ఈ సీరియల్ శుభం కార్డు పలుకుతుందని నెటిజన్లు అంటున్నారు.

తాజాగా డాక్టర్ బాబు తన కూతుర్లు హిమ, సౌర్య తో కలిసి ఏదో జర్నీ లో ఉన్నట్లు కనిపించాడు.

ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.దీంతో ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు, ఈ సీరియల్ అభిమానులు తెగ చర్చలు చేసుకుంటున్నారు.

"""/"/ ఈ సీరియల్ నటీనటులు వేరే ప్రదేశానికి వెళ్లారని ఆ తర్వాత ఈ సీరియల్ కూడా త్వరలో శుభం కార్డు పలుకుతుందని అంటున్నారు.

మరికొందరు మోనిత క్యారెక్టర్ ఇక ఉండదని అందుకే జర్నీ చేసి మళ్లీ సీరియల్ లో అడుగు పెడతారని అంటున్నారు.

మొత్తానికి ఈ ఫొటోలతో నెటిజన్లు ఊహల్లో మునిగిపోతున్నారు.దీనిని బట్టి చూస్తే డైరెక్టర్ కంటే ముందే నెటిజన్లు ఈ సీరియల్ కు స్టోరీ క్రియేట్ చేసి ముగింపు పలికే విధంగా కనిపిస్తున్నారు.

నిజానికి నెటిజన్ల క్రియేషన్స్ చూస్తే మాత్రం ఇదెక్కడి మాస్ రా మావ అనకుండా ఉండలేము అని అర్థమవుతుంది.