భారతీయ జర్నలిస్ట్ సిద్ధిఖీ కాల్పుల్లో చనిపోలేదు.. తాలిబన్లే హింసించి చంపారు: అమెరికన్ మేగజైన్ సంచలనం
TeluguStop.com
ఇండియన్ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు విజేత డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌లో ఆయన పని చేస్తున్నారు.ఈ క్రమంలో జూలై 16 రాత్రి కాందహార్‌లో జరిగిన తాలిబన్ల దాడిలో డానిష్ మరణించారు.
ఆఫ్ఘన్ స్పెషల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్కడి తాజా పరిస్థితిని ఆయన ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే స్పిన్ బోల్డక్‌లోని ప్రధాన మార్కెట్ ప్రాంతాన్ని ఆఫ్ఘన్ ప్రత్యేక దళాలు తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తాలిబన్లు ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారు.
ఈ ఘటనలో సిద్దిఖీతోపాటు ఓ సీనియర్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు.అయితే డానిష్ సిద్ధిఖీ ప్రమాదవశాత్తూ కాల్పుల్లో చనిపోలేదని తాలిబన్లే దారుణంగా హత్య చేశారంటూ అమెరికాకు చెందిన ఓ మేగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
డానిష్ ఐడెంటిటీని గుర్తించిన తాలిబన్లు అతన్ని బంధించి హింసించి ఉరి తీసి చంపారని నివేదిక పేర్కొంది.
38 ఏళ్ల సిద్ధిఖీపై కాల్పులు జరిపిన అనంతరం తాలిబన్లు అతన్ని ఉరితీశారంటూ అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ ఫెలోగా మైఖేల్ రూబిన్ మ్యాగజైన్‌లో రాసుకొచ్చారు.
"""/"/
పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో అఫ్ఘన్ దళాలు తాలిబాన్ల మధ్య ఘర్షణను కవర్ చేసేందుకు సిద్దిఖీ ఒక అఫ్ఘన్ నేషనల్ ఆర్మీ బృందంతో స్పిన్ బోల్డాక్ ప్రాంతానికి వెళ్లారు.
అప్పుడు తాలిబాన్లు దాడి చేయడంతో సిద్దిఖి నుంచి కొంతమంది విడిపోయారు.మరో ముగ్గురు అఫ్ఘన్ దళాల వద్ద ఉన్నారు.
ఈ సమయంలో సిద్ధిఖికి గాయమవ్వడంతో వెంటనే అతన్ని ఆర్మీ బృందం స్థానిక మసీదుకు తీసుకెళ్లింది.
అక్కడే అతడికి ప్రథమ చికిత్స అందించారు.అయితే ఒక జర్నలిస్ట్ మసీదులో ఉన్నాడనే వార్త తెలిసిన వెంటనే తాలిబాన్లు దాడి చేశారు.
సిద్దిఖీ అక్కడ ఉన్నాడనే సమాచారంతోనే తాలిబాన్ మసీదుపై దాడి చేసినట్లు స్థానిక దర్యాప్తులో తేలిందని నివేదిక వెల్లడించింది.
తాలిబాన్లు అతన్ని బంధించినప్పుడు సిద్దిఖీ బతికే ఉన్నాడు.సిద్దిఖీ గుర్తింపును ధృవీకరించిన తరువాతే అతనితో పాటు బంధించిన వారిని ఉరితీశారు.
అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన ఆర్మీ బృందాన్ని కూడా చంపేశారని రూబిన్ తన మ్యాగజైన్ లో తెలిపారు.
సిద్ధిఖీని ముందుగా తీవ్రంగా హింసించి తలపై కొట్టి తుపాకీతో కాల్పులు జరిపారు.అనంతరం అతన్ని ఉరితీసినట్టు రూబిన్ రాసుకొచ్చారు.
తాలిబన్లు హింసించిన తీరును చూస్తే.యుద్ధ నియమాలను, సంప్రదాయాలను గౌరవించలేదని తెలుస్తోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"""/"/
అయితే ఘటన జరిగిన మరుసటి రోజు తాలిబన్లు స్పందిస్తూ డానీష్ ఎవరి కాల్పుల వల్ల మరణించారో తమకు తెలియదని చెప్పారు.
డానిష్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.జర్నలిస్టులు వార్ జోన్‌లలోకి ప్రవేశించేటప్పుదు ముందస్తు సమాచారం ఇవ్వాలని.
అప్పుడు వారి ప్రాణాలకు అపాయం కలగకుండా చూసుకుంటామని తాలిబన్లు చెప్పారు.వారు చెప్పిన దానికి రూబిన్ రాసుకొచ్చిన దానికి ఏ మాత్రం పొంతన లేకపోవడంతో మరోసారి తాలిబన్లు స్పందిస్తే తప్ప డానీష్ మరణంపై స్పష్టత రాదు.
ప్రవాసీ భారతీయ దివస్ 2025 .. భువనేశ్వర్‌లో ఎన్ఆర్‌లకు భారీ స్వాగత ఏర్పాట్లు