ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల చదువు విషయంలో తాలిబన్లు సంచలన నిర్ణయం..!!

ఆఫ్గనిస్థాన్ దేశంలో తాలిబన్లు దాదాపు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కదలటం తెలిసిందే.

ఈ క్రమంలో మహిళల చదువుల విషయంలో తాలిబాన్లు చాలా కఠోరంగా వ్యవహరిస్తారని చాలామంది భావించారు.

తాలిబన్లు సామ్రాజ్యంలో అసలు మహిళలకు గౌరవం ఉండదని.మొన్నటిదాకా వార్తలు వచ్చాయి.

ఇదే తరుణంలో కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ మహిళలు ధర్నాలు నిరసనలు కూడా చేపట్టడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా తాలిబన్లు మహిళల విద్యకు సానుకూలత వ్యక్తం చేశారు.యూనివర్సిటీలో చదువుకునేందుకు అనుమతులు ఇస్తూనే స్త్రీపురుషులకు వేరువేరు తరగతులు ఉండేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అంత మాత్రమే కాక చదువుకునే స్త్రీ.కచ్చితంగా ఇస్లామిక్ సాంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధన కూడా విధించారు.

తాలిబాన్లు తీసుకున్న తాజా నిర్ణయంతో ఆఫ్ఘనిస్థాన్ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దాదాపు 20 సంవత్సరాల తర్వాత తాలిబన్లు మళ్లీ ప్రభుత్వం స్థాపించడంతో గతంలో మాదిరి మహిళలకు విద్యను నిరాకరిస్తారు అని భావించారు.

కానీ అనూహ్యంగా మహిళలకు విద్య ఈ విషయంలో తాలిబన్లు సానుకూలంగా స్పందించడంతో.ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది.

యూకే: ఇంట్లోకి దూరి మహిళ బట్టలుతికి వంట చేసిన దొంగ.. లాస్ట్ ట్విస్ట్..?