చియాన్ విక్ర‌మ్ హీరోగా ఎస్‌.యు.అరుణ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’లో వెర్స‌టైల్ యాక్ట‌ర్ సిద్ధికీ

విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్ ( Chiyaan Vikram )హీరోగా హెచ్‌.ఆర్‌.

పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.

అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’.

విక్ర‌మ్ 62వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.విక్ర‌మ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన టైటిల్ టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ సినిమాలో మ‌ల‌యాళ వెర్స‌టైల్ యాక్ట‌ర్ సిద్దికీ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు.ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఆయ‌న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

మ‌ల‌యాళ న‌టుడు సిద్ధికీ( Siddique ) గురించి ప్ర‌త్యేకమైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల‌తో పాటు ప‌లు హిందీ చిత్రాల్లో న‌టించి మెప్పించారు.

తెలుగులో అంతిమ తీర్పు, నా బంగారు త‌ల్లి, అగ్ని న‌క్ష‌త్రం వంటి చిత్రాల్లో మెప్పించారు.

రీసెంట్‌గా విక్ర‌మ్ పాత్ర‌ను రివీల్ చేస్తూ విడుద‌ల చేసిన టైటిల్ టీజ‌ర్‌తో ప్రేక్ష‌కుల్లో వీర ధీర శూర‌న్‌పై క్యూరియాసిటీ పెరిగింది.

ఇప్పుడు సిద్ధికీ కూడా న‌టిస్తుండ‌టం సినిమాపై ఆస‌క్తిని పెంచింది ‘వీర ధీర శూరన్( Veera Dheera Sooran )’ చిత్రంలో త‌న‌దైన స్టైలో విక్ర‌మ్ డిఫ‌రెంట్ లుక్‌, మాస్ యాక్టింగ్‌తో కాళి పాత్ర‌లో అంద‌రినీ మెస్మ‌రైజ్ చేశారు.

టైటిల్ టీజ‌ర్ చూసిన వారికి విక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి ఓ పాత్ర‌లో మెప్పించ‌బోతున్నార‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది.

విక్ర‌మ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధికీతో పాటు ఎస్‌.

జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

జి.వి.

ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.h3 Class=subheader-styleన‌టీన‌టులు:/h3p చియాన్ విక్ర‌మ్‌, ఎస్‌.

జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ త‌దిత‌రులు H3 Class=subheader-styleసాంకేతిక వ‌ర్గం:/h3p బ్యాన‌ర్ : హెచ్‌.

ఆర్‌.పిక్చ‌ర్స్‌, నిర్మాత‌: రియా శిబు, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.

యు.అరుణ్‌కుమార్‌, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌: రోని జ‌కారియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అన్‌లిన్ లాల్‌, మ్యూజిక్‌: జి.

వి.ప్ర‌కాష్ కుమార్‌, సినిమాటోగ్ర‌ఫీ: తేని ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌: సి.

ఎస్‌.బాల‌చంద‌ర్‌, కాస్ట్యూమ్స్‌: క‌విత‌.

జె, పి.ఆర్‌.

ఒ (తెలుగు): సురేంద్ర నాయుడు- ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

పుదీనాతో ఆశ్చర్యపోయే లాభాలు.. ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా?