మోహన్ బాబు కోపం ఆయనకు చెడు చేసింది : తలసాని
TeluguStop.com
ఎన్నో వివాదాలు మరెన్నో గొడవల తర్వాత టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ ఎసోసియేషన్ ఎన్నికలు జరిగాయి.
ఎప్పుడు ఇంత వాదనలు కానీ దూషించు కోవడం కానీ లేవు.కానీ ఈసారి ఇటు ప్రకాష్ రాజ్ కానీ అటు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఎవ్వరు తగ్గకుండా ప్రెస్ మీట్లు పెట్టి మరి దూషించు కున్నారు.
ఇంత హీట్ పెంచేసిన మా ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలిపొందారు.
మా అధ్యక్ష పదవిని చేపట్టిన మంచు విష్ణు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు.
ఫిలిం నగర్ కల్చరర్ సెంటర్ లో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది.
మంచు విష్ణుతో పాటు తన ప్యానల్ లోని సభ్యులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన తలసాని జ్యోతి ప్రజ్వలన చేసారు.ఆ తర్వాత తలసాని మీడియాతో మాట్లాడారు.
"""/"/ మా ఎన్నికల్లో ఎన్నికయిన సబ్యులకు అభినందనలు తెలిపారు.ఇది సంతోషకరమైన సందర్భం అని ఆయన వ్యాఖ్యానించారు.
మా అంటే చిన్న అసోసియేషన్ కాదు.ఇది ఒక పెద్ద వ్యవస్థ.
మోహన్ బాబు మంచు విష్ణు కు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ కూడా ఇచ్చారు.
"""/"/
మోహన్ బాబుకు కోపం, ఆవేశం ఎక్కువని ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటారు.తప్పును తప్పు అని ధైర్యంగా చెబుతారు.
మోహన్ బాబు నుండి నేను చాలా నేర్చుకున్నాను.ఆయన కోపం ఆయనకే నష్టం చేసింది కానీ ఇతరులకు కాదు.
అని వ్యాఖ్యానించారు.ఇక మా సంస్థ గురించి మాట్లాడుతూ.
అర్హులైన కళాకారులకు ప్రభుత్వం నుండి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తామని.సినిమాను థియేటర్ లోనే చూడాలని.
ఆ వ్యాధితో బాధ పడుతున్నానని అప్పుడే తెలిసింది.. శివరాజ్ కుమార్ కామెంట్స్ వైరల్!