వైరల్: రాంచీలో దర్శనం ఇచ్చిన తక్షక సర్పం!

తక్షక నాగు( Takshak Cobra Snake ) గురించి మీరు వినే ఉంటారు.

దీని ప్రస్తావన మహాభారతంలో( Mahabharatam ) మనం చూడవచ్చు.జనమేజయుడు సర్పయాగం చేస్తాడు.

దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని పాములను అగ్నిలో కాల్చి చంపడం.విషయం ఏమిటంటే.

పాండవుల అనంతరం పరీక్షిత్తు, పరీక్షిత్తు అనంతరం జనమేజయుడు చక్రవర్తులు అవుతారు.నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు సర్పయాగం గురించి చెప్పగా ఉదంకోపాఖ్యానంతో ఈ వృత్తాంతం మొదలవుతుంది.

కశ్యపుడు, అతని మూడవ భార్య కద్రువకు వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు జన్మిస్తారు.

"""/" / ఇక తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది.

పైలుడు అనే మహర్షి శిష్యుడు ఉదంకుడు.అతను ఒకమారు గురుపత్ని కోరికపై మహిమాన్విత కుండలాలు తీసుకొని వెళుతుండగా వాటిని తక్షకుడు అపహరిస్తాడు.

అందువలన అతను తక్షకుని పట్లా, నాగజాతిపట్ల కోపం పెంచుకుంటాడు.ఈ క్రమంలో జనమేజయుని వద్దకు వెళ్ళి సర్పయాగం చేయమని చెబుతాడు.

ఈ నేపథ్యంలో జనమేజయుని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తు చేస్తాడు.

జరిగిన వృత్తాంతం సాక్ష్యాలతో సహా తెలుసుకొన్న జనమేజయుడు సర్పయాగానికి ఆజ్ఞాపిస్తాడు. """/" / ఇంతకీ ఈ కథ ఎందుకంటే, తక్షక జాతికి చెందిన నాగులు చాలా అరుదుగా మనకి కనిపిస్తాయి.

తాజాగా ఝార్ఖండ్‌లో( Jharkhand ) ఈ అరుదైన పాము కనువిందు చేసింది.అవును, రాంచీలోని( Ranchi ) ఓ ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన ఈ పామును చూసి అధికారులు భయపడిపోయారు.

పామును చూసిన ప్రజలు వెంటనే స్నేక్ క్యాచర్ రమేష్ కుమార్ మహతోకు కాల్ చేయగా ఆయన వచ్చి పామును రక్షించాడు.

అయితే స్నేక్ క్యాచర్ పాముతో కాసేపు ఆడుకోవడంతో అక్కడ జనాలు భారీగా ఆ దృశ్యాలను తిలకించారు.

స్థానికులు ఈ అరుదైన పామును వింతగా వీక్షించారు.దీనిని చూసినవారు ఝార్ఖండ్‌లో ఇలాంటి పాము కనిపించడం ఇదే తొలిసారి అని చెప్పారు.

ఈ పాము విషపూరితమైనదని.చిన్న బల్లలను తింటుందన్నారు.

అయితే తక్షక నాగు మనుషులకు అంత ప్రమాదం కాదన్నారు స్నేక్ క్యాచర్.

హనుమాన్ రికార్డ్ ను క్రాస్ చేసే సినిమా ఏది.. సంక్రాంతికి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?