ఈ పొడిని రోజుకో స్పూన్ చ‌ప్పున తీసుకుంటే పొట్ట కొవ్వు క‌ర‌గ‌డం ఖాయం!

గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌టం, షుగ‌ర్ మ‌రియు షుగ‌ర్ పానియాల‌ను అధికంగా తీసుకోవ‌డం, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, మ‌ద్య‌పానం, ధూమపానం, శ‌రీరానికి స‌రిప‌డా ప్రోటీన్‌ను అందించ‌క‌పోవ‌డం, ఒత్తిడి, మెనోపాజ్ వంటి కార‌ణాల వ‌ల్ల పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోవ‌డం స‌ర్వ సాధార‌ణం.

ఆ కొవ్వును అలానే వ‌దిలేస్తే పొట్ట లావుగా, అంద‌వికారంగా మార‌డ‌మే కాదు వివిధ రకాల అనారోగ్య స‌మ‌స్య‌లు సైతం త‌లెత్తుతాయి.

కాబ‌ట్టి, పొట్ట కొవ్వును క‌రిగించుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.అయితే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే పొడి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఆ పొడి ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.

? మ‌రియు ఏ విధంగా వాడాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక క‌ప్పు అవిసె గింజ‌ల‌ను వేసి బాగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి.ఆయిల్ హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, ధ‌నియాలు వేసుకోవాలి.

అలాగే పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీల‌క‌ర్ర‌, ఎనిమిది ఎండు మిరిప‌కాయ‌లు, నాలుగైదు వెల్లుల్లి రెబ్బ‌లు, మూడు రెబ్బల క‌రివేపాకు వేసుకుని వేయించుకోవాలి.

"""/"/ ఆ త‌ర్వాత మిక్సీ జార్‌లో అవిసె గింజ‌ల‌తో స‌హా వేయించి పెట్టుకున్న ప‌దార్థాల‌న్నీ వేసుకోవాలి.

అలాగే రుచికి స‌రిప‌డా ఉప్పు, కొద్దిగా చింత‌పండు వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే అవిసెగింజ‌ల కారం పొడి సిద్ధం అవుతుంది.

ఈ పొడి రుచిగా ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా భోజ‌నం చేసేట‌ప్పుడు మొద‌టి ముద్ద‌లో వ‌న్ టేబుల్ స్పూన్ ఈ అవిసె గింజ‌లు కారం పొడిని క‌లిపి తినాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్ర‌మంగా క‌రిగిపోతుంది.

వెయిట్ లాస్ కూడా అవుతారు.

వైరల్ వీడియో: డాన్స్ చేస్తూ ఉన్నట్లుండి మృతి చెందిన అమ్మాయి.