రోజు మార్నింగ్ ఈ మ్యాజికల్ డ్రింక్ ను తీసుకుంటే నెల రోజుల్లో మీ పొట్ట నాజూగ్గా మారుతుంది!
TeluguStop.com
సాధారణంగా కొందరికి శరీరం మొత్తం సన్నగానే ఉన్న పొట్ట మాత్రం లావుగా ఉంటుంది.
గంటల తరబడి కూర్చుని ఉండడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మద్యపానం, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు( Fat Belly ) పేరుకుపోతుంది.
పొట్ట కొవ్వు కారణంగా బాడీ షేప్ అవుట్ అవుతుంది.అందవిహీనంగా కనిపిస్తారు.
ఈ క్రమంలోనే చాలా మంది బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
"""/" /
రోజు మార్నింగ్ ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే నెల రోజుల్లో మీ బాన పొట్ట నాజూగ్గా మారుతుంది.
మరి ఇంతకీ ఆ మ్యాజికల్ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర( Cumin ), వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు( Anise Seeds ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ) వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.
అలాగే నైట్ అంతా నానబెట్టుకున్న జీలకర్ర, సోంపు, మెంతులను నీటితో సహా వేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించాలి.
"""/" /
ఆపై స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధమవుతుంది.
గోరువెచ్చగా అయిన తర్వాత నేరుగా ఈ డ్రింక్ ను సేవించాలి.ఇదొక ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మాదిరి పనిచేస్తుంది.
నిత్యం దీన్ని తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట నాజూగ్గా మారుతుంది.
పైగా ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యానికి అండగా నిలబడుతుంది.
మొటిమలు లేని మెరిసే చర్మాన్ని అందిస్తుంది.మరియు ఈ డ్రింక్ ను నిత్యం తీసుకోవడం వల్ల బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలు సైతం తొలగిపోతాయి.
స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?