రోజు ఉదయం ఈ డ్రింక్ తాగితే నీరసం, అలసట దరి దాపుల్లోకి కూడా రావట!
TeluguStop.com
అసలే ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది.ఈ సీజన్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నీరసం, అలసట వంటి సమస్యలు తరచూ వేధిస్తూనే ఉంటాయి.
దాంతో వాటిని నివారించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్‌ను రోజు ఉదయాన్నే తీసుకుంటే నీరసం, అలసట దరి దాపుల్లోకి రావడానికి కూడా భయపడతాయి.
మరి లేటెందుకు ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు ఎండు ఖర్జూరాలు, ఒక ఎండిన అంజీర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఉదయం ఖర్జూరాల నుంచి గింజను తొలగించాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఎండు ఖర్జూరం, అంజీర్ లను వాటర్‌తో సహా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆపై స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ ఫ్యాట్ లెస్ పాలను పోయాలి.
పాలు కాస్త హీట్ అవ్వగానే.అందులో గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం, అంజీర్ మిశ్రమాన్ని వేయాలి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసి ఐదారు నిమిషాల పాటు మరిగిస్తే.
ఖర్జూరం అండ్ అంజీర్ డ్రింక్ సిద్ధం అవుతుంది. """/" /
చక్కటి రుచిని కలిగి ఉండే ఈ డ్రింక్‌ను ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ చప్పున తాగితే.
నీరసం, అలసట వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.బాడీ రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది.
రక్తహీనత, మతిమరుపు, రక్తపోటు వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.మరియు రోగ నిరోధక శక్తి సైతం రెట్టింపు అవుతుంది.
కాబట్టి, ఈ సూపర్ టేస్టీ డ్రింక్ ను తప్పకుండా మీ డైట్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.
ఏందిరా అయ్యా.. బట్టతలపై జుట్టు వస్తుందంటే ఇంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారా.?