రోజు నైట్ ఈ డ్రింక్ తాగితే నిద్ర తన్నుకొస్తుంది..!
TeluguStop.com
ఇటీవల రోజుల్లో పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, అధిక స్క్రీన్ టైప్ కారణంగా కంటి నిండా నిద్రలేక చాలా మంది చాలా రకాల సమస్యలను ఫేస్ చేస్తున్నారు.
ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో నిద్ర( Sleep ) కూడా అంతే ముఖ్యం.
అందుకే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు పదే పదే చెబుతుంటారు.
అయితే కొంతమందికి ఎంత ప్రయత్నించిన కూడా నిద్ర రానే రాదు.ఇలాంటివారు మందులపై ఆధారపడుతుంటారు.
అయితే మందుల అవసరం లేకుండా కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ సూపర్ గా హెల్ప్ చేస్తుంది.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flaxseeds ) రెండు టేబుల్ స్పూన్లు సోంపు,(
Fennel Seeds ) వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు ఏడు నుంచి ఎనిమిది యాలకులను వేసి స్లైట్ గా వేయించుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న పదార్థాలతో పాటు అంగుళం దాల్చిన చెక్కను( Cinnamon ) కూడా చేర్చి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి. """/" /
రోజు నైట్ నిద్రించే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ లేదా పాలు తీసుకుని అందులో వన్ టీ స్పూన్ తయారు చేసుకున్న పొడిని కలిపి సేవించాలి.
రోజు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే నిద్ర హార్మోన్లు ఉత్తేజంగా మారతాయి.
నిద్రలేమి సమస్య దూరమవుతుంది.ప్రశాంతమైన నిద్ర మీసొంతం అవుతుంది.
నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. """/" /
అలాగే ఈ డ్రింక్ చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేస్తుంది.అదే సమయంలో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.
బాడీని డీటాక్స్ చేస్తుంది.మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.