వ‌ర్షాకాలం మొద‌లైంది.. ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు!

వ‌ర్షాకాలం రానే వ‌చ్చింది.వేస‌వి వేడి నుంచి ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకుంటున్నారు.

అయితే వర్షాకాలాన్ని వ్యాధుల కాలం అని కూడా అంటారు.ఎందుకంటే, మిగిలిన కాలాల కంటే వ‌ర్షాకాలంలోనే సీజ‌న‌ల్ రోగాలు అధికంగా ఇబ్బంది పెడుతుంటాయి.

వాటి నుంచి త‌ప్పుకోవాలంటే ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద‌యం లేవ‌గానే ఒక క‌ప్పు టీ లేదా కాఫీ తాగే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.

అయితే వ‌ర్షాకాలంలో గ్రీన్ టీ, మింట్ టీ, అల్లం టీ, తుల‌సి టీ, లెమ‌న్ టీ వంటి హెర్బ‌ల్ టీల‌ను ఎంచుకోవాలి.

ఇవి ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ను స్ట్రోంగ్‌గా మార్చి.జ‌లుబు, ద‌గ్గు, వైర‌ల్ ఫీవ‌ర్ వంటి సీజ‌న‌ల్ రోగాల‌ బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తాయి.

అలాగే వ‌ర్షాకాలంలో వీలైనంత వ‌ర‌కు సీఫుడ్‌ను ఎవైడ్ చేయాలి.ఈ కాలంలో సముద్ర ఆహారం తినడం వ‌ల్ల అనేక వ్యాధులు త‌లెత్తుతాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

ఈ సీజ‌న్‌లో నీరు కలుషితమై ఉంటుంది.క‌లుషిత‌మైన నీటిని తాగితే జ‌బ్బుల బారిన ప‌డ‌తారు.

"""/" / అందుకే నీటిని కాచి చ‌ల్లార్చుకుని తాగాలి.రాగి బిందెలో నీటిని నిల్వ చేసుకుని కూడా తాగొచ్చు.

రాగి నీళ్లను పరిశుభ్రం చేస్తుంది.క్రిములను అంతం చేస్తుంది.

వ‌ర్షాకాలంలో రాగి బిందెలో నిల్వ చేసిన నీటిని తాగ‌డం ఎంతో ఉత్త‌మం.అలాగే ప‌చ్చి ఆహారాల‌కు ఈ సీజ‌న్‌లో దూరంగా ఉండాలి.

వండ‌కుండా ఏ ఆహార‌ము తీసుకోరాదు. """/" / వర్షాకాలం జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.

అందువ‌ల్ల‌, ఫాస్ట్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్ తీసుకోకపోవడం ఉత్త‌మం.ఇక‌ ఏదైనా ఫుడ్‌ను తీసుకునే ముందు త‌ప్ప‌కుండా చేతుల‌ను శుభ్ర‌ప‌రుచుకోవాలి.

శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.మ‌రియు రోజుకు క‌నీసం ఇర‌వై నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలి.

ఈ జాగ్ర‌త్త‌లన్నీ తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు.

ఈ న్యాచుర‌ల్ క్రీమ్ తో వైట్ అండ్ స్మూత్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?