వేసవిలో సపోటాను ఇలా తీసుకున్నారంటే మీ బాడీలో వేడి మొత్తం ఆవిరైపోతుంది!

ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఎండలు ఎంతలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

వేసవి వేడిని తట్టుకోలేక ప్రజలు ఆగమాగం అయిపోతున్నారు.ముఖ్యంగా వేసవిలో బాడీ హీట్ ను తగ్గించుకునేందుకు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు.

అయితే సమ్మర్ లో బాడీ హీట్ ను మాయం చేయడానికి కొన్ని కొన్ని ఫ్రూట్స్ చాలా బాగా సహాయపడతాయి.

సపోటా కూడా ఆ కోవకే చెందుతుంది.సపోటా పండు తినడానికి రుచికరంగానే కాదు ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటుంది.

ఐరన్, కాల్షియం, నియాసిన్, ఫాస్పరస్, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఎ తో సహా అనేక పోషకాలను సపోటా ద్వారా పొందవచ్చు.

"""/" / ముఖ్యంగా వేసవిలో సపోటా( Sapota )ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకున్నారంటే మీ బాడీలో వేడి మొత్తం దెబ్బకు ఆవిరైపోతుంది.

అందుకోసం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో రెండు పీల్ మరియు సీడ్ లెస్ సపోటా పండ్లు వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు,( Milk ) రెండు నుంచి మూడు ఐస్ క్యూబ్స్ మరియు వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

దాంతో మన సపోటా జ్యూస్ అనేది రెడీ అవుతుంది. """/" / వేసవిలో ఈ సపోటా జ్యూస్ ను తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.

ప్రధానంగా ఈ సపోటా జ్యూస్ శరీరంలో అధిక వేడిని తొలగిస్తుంది.బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ను ఇస్తుంది.

నీరసం, అలసట వంటి సమస్యలను దూరం చేస్తుంది.శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది.

హిట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటివి మీ దరిదాపుల్లోకి రాకుండా ఈ సపోటా జ్యూస్ రక్షణ కల్పిస్తుంది.

అలాగే ఈ సపోటా జ్యూస్ మంచి స్ట్రెస్ బస్టర్ గా పని చేస్తుంది.

ఒత్తిడిని తగ్గించి మైండ్ ను ప్రశాంతంగా మారుస్తుంది.సపోటా జ్యూస్ లో విటమిన్ సి మెండుగా ఉంటుంది.

ఇది రోగ నిరోధక( Immunity ) శ‌క్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తిని అందించ‌డంతో గ్రేట్ గా స‌హాయ‌ప‌డుతుంది.

అంతేకాకుండా సపోటా జ్యూస్ ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల‌ స్కిన్ తేమ‌గా ఉంటుంది.

ముడ‌త‌లు, చ‌ర్మం సాగ‌డం వంటి ఏజింగ్ లక్షణాలు దూరం అవుతాయి.చ‌ర్మం అందంగా, య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

దేవర మూవీ సక్సెస్ సాధిస్తే ఎన్టీయార్ కంటే కొరటాల శివ కే ఎక్కువ పేరు వస్తుందా..?