గుమ్మడి గింజలను ఇలా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు దెబ్బకు కరిగిపోతాయి!

ఇటీవల కాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారు.కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వల్ల కడుపు నొప్పి, నడుం నొప్పి, తరచూ జ్వరం రావడం, వాంతులు, అజీర్తి, పొట్ట ఉబ్బరం, మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంట, ఆకలి మందగించడం తదితర లక్షణాలన్నీ తలెత్తుతుంటాయి.

కిడ్నీలో రాళ్లను నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత ముదిరిపోతుంది.దాంతో ఆపరేషన్ వరకు వెళ్లాల్సి ఉంటుంది.

అయితే అంత వ‌ర‌కు వెళ్ల‌కుండా కొన్ని కొన్ని ఆహారాల ద్వారా కూడా కిడ్నీలో రాళ్లను కరిగించుకోవచ్చు.

ముఖ్యంగా గుమ్మడి గింజలు అందుకు అద్భుతంగా సహాయపడతాయి.ఇప్పుడు చెప్పబోయే విధంగా గుమ్మడి గింజలు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు దెబ్బకు కరిగిపోతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం గుమ్మడి గింజలను ఎలా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డవ‌చ్చో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు, రెండు వాల్ న‌ట్స్‌ వేసి ఒక గ్లాస్‌ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

"""/"/ మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే బ్లెండర్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న గుమ్మడి గింజలు మరియు వాల్ న‌ట్స్‌ వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము ముక్కలు వేసుకోవాలి.

చివరగా ఒక గ్లాస్‌ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి ప‌ల్చ‌టి వ‌స్త్రం స‌హాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి సేవించాలి.

ప్రతిరోజు ఈ గుమ్మ‌డి గింజ‌ల డ్రింక్ ను తీసుకుంటే కిడ్నీలో రాళ్లు క్రమంగా కరిగిపోతాయి.

అదే సమయంలో బరువు తగ్గుతారు.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

మరియు నిద్రలేమి సమస్య నుంచి సైతం విముక్తి లభిస్తుంది.