బరువు పెరుగుతామని పాలను ఎవైడ్ చేస్తున్నారా? అయితే ఇలా చేయండి!
TeluguStop.com
పాలు.సంపూర్ణ పోషకాహారం.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పాలు ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో విలువైన పోషకాలను అందిస్తాయి.
కానీ, బరువు పెరుగుతాము అన్న భయంతో కొందరు పాలను ఎవైడ్ చేస్తుంటారు.పాలు ఆరోగ్యానికి మంచివని తెలిసినా పక్కన పెడుతుంటారు.
ఈ లిస్ట్ లో మీరు ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విధంగా పాలను తీసుకుంటే.
బరువు పెరగడం కాదు తగ్గుతారు.పైగా శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు సైతం లభిస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ ప్యాట్ లెస్ మిల్క్‌ను పోయాలి.
పాలు కాస్త హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు మిరియాల పొడి, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న దంచిన అల్లం ముక్క వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
చివరిగా రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసి మరొక్క నిమిషం పాటు మరిగించుకోవాలి.
ఆపై పాలను ఫిల్టర్ చేసుకుని సేవించాలి. """/" /
ఈ విధంగా పాలను ప్రతి రోజు ఒక గ్లాస్ చప్పున తీసుకుంటే శరీరంలో పేరుకు పోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
వెయిట్ లాస్ అవుతారు.రోగ నిరోధక వ్యవస్థ సూపర్ స్ట్రోంగ్ గా మారుతుంది.
నిద్ర లేమి సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.లివర్ శుభ్రంగా మారుతుంది.
జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, తలనొప్పి వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.
కీళ్ల వాపులు, నొప్పులు వంటివి తగ్గు ముఖం పడతాయి.గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.