నెలసరి సమయంలో నెయ్యిని ఇలా తీసుకుంటే నొప్పులన్నీ పరార్ అవ్వాల్సిందే!
TeluguStop.com
నెలసరి అంటేనే కొందరు ఆడవారు తెగ వణికిపోతుంటారు.ఎందుకంటే నెలసరి అందరికీ ఒకేలా ఉండదు.
కొందరిలో నెలసరి చాలా సులభంగా అయిపోతుంది.కానీ కొందరికి మాత్రం చాలా కఠినంగా ఉంటుంది.
ముఖ్యంగా నెలసరి సమయంలో కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, నడుము నొప్పి తదితర నొప్పులన్నీ తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.
వాటి వల్ల ఏ పని చేయలేకపోతుంటారు.ఈ క్రమంలోనే ఆయా నొప్పులను దూరం చేసుకోవడానికి పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు.
కానీ సహజంగా కూడా నెలసరి నొప్పులు వదిలించుకోవచ్చు.అందుకు నెయ్యి అద్భుతంగా సహాయపడుతుంది.
దాదాపు అందరి ఇళ్లల్లోనూ నెయ్యి కామన్ గా ఉంటుంది.నెయ్యి రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకల విలువలను సైతం కలిగి ఉంటుంది.
అందుకే ఆరోగ్య పరంగా నెయ్యి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.అలాగే నెలసరి నొప్పులను దూరం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
అందుకోసం నెలసరి సమయంలో ఒక గ్లాసు గోరు వెచ్చని పాలల్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కలిపి సేవించాలి.
ఇలా పాలల్లో నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వేధించే నొప్పులు దూరం అవుతాయి.
అలాగే పాలల్లో నెయ్యి కలిపి తాగితే జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారుతుంది.
ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మలబద్ధకం ఉంటే దూరం అవుతుంది.
"""/"/
పాలల్లో నెయ్యి కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి.ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.
మెదడు ప్రశాంతంగా మారుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
శరీరం శక్తివంతంగా సైతం మారుతుంది.అయితే నెయ్యి పాలతో ఇష్టపడనివారు టీ లేదా కాఫీలో కలిపి కూడా తీసుకోవచ్చు.
టీ లేదా కాఫీలో కలిపి తీసుకున్న సరే నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందారు.
సీఎన్జీ ఫిల్లింగ్ సమయంలో అలసత్వం.. గాయాలపాలైన వర్కర్(వీడియో)