చియా సీడ్స్‌ను ఉద‌యాన్నే ఇలా తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు!

రోజంతా యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా ఉండాల‌ని అంద‌రికీ ఉంటుంది.కానీ, ఇలా ఉండ‌టం చాలా మందికి సాధ్యం కాదు.

ఆహార‌పు అల‌వాట్లు, ప‌ని ఒత్తిడి కార‌ణంగా కొంద‌రు సాయంత్రానికి, మ‌రికొంద‌రైతే మ‌ధ్యాహ్నానికే అల‌సిపోతుంటారు.

అయితే చియా సీడ్స్‌ను ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే గ‌నుక రోజంతా ఫుల్ యాక్టివ్‌గా ఉండొచ్చు.

చియా సీడ్స్ లో కాల్షియం, మెగ్నీషియం, జింక్‌, మాంగ‌నీస్‌, పొటాషియం, ఐర‌న్‌, విట‌మిస్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, ఫైబ‌ర్, ప్రోటీన్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ వంటి ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

అందు వ‌ల్లే చియా సీడ్స్ ఆరోగ్య ప‌రంగా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.ముఖ్యంగా చియా సీడ్స్‌ శ‌రీరాన్ని శ‌క్తివంతంగా మార్చి.

రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేయ‌గ‌ల‌వు.మ‌రి అందుకోసం వీటిని ఎలా తీసుకోవాలో చూసేయండి.

ముందుగా బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌, క‌ప్పు బాదం పాలు, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత మూత పెట్టి నైటంతా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. """/" / ఉద‌యాన్నే చియా సీడ్స్ మిశ్ర‌మాన్ని ఫ్రిడ్జ్‌లో నుంచి బ‌య‌ట‌కు తీసి.

అందులో దానిమ్మ గింజ‌లు, యాపిల్ ముక్క‌లు క‌లుపుకుని బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలో తినాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల బాడీ సూప‌ర్ యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా మారుతుంది.

నీరసం, అల‌స‌ట ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.రోజంతా ఎంతో ఉత్సాహంగా ప‌ని చేస్తారు.

అంతేకాదు, చియా సీడ్స్‌ను పైన చెప్పిన విధంగా తీసుకుంటే మ‌ల‌బ‌ద్ధ‌కం దూరం అవుతుంది.

అతి ఆక‌లి త‌గ్గు ముఖం ప‌డుతుంది.ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

మ‌రియు చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.అయితే చాలా మందికి బాదం పాలు ఉండ‌క‌పోవ‌చ్చు.

అలాంట‌ప్పుడు ఆవు పాలు, గేదె పాలు, కొబ్బ‌రి పాలు, సోయా పాలు ఇలా ఏ పాలు అందుబాటులో ఉంటే ఆ పాల‌ను వాడుకోవ‌చ్చు.

బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్న పూరీ.. నటసింహం ఛాన్స్ ఇస్తారా?