ఆ టాలీవుడ్ హీరోలో నా తమ్ముడిని చూసుకుంటున్నా… శివ రాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్!

కన్నడ చిత్ర పరిశ్రమలో దివంగత నటుడు రాజ్ కుమార్ వారసులుగా ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ కు హీరోలుగా ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

ఇలా ఇండస్ట్రీలో రాజ్ కుమార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

అయితే రెండు సంవత్సరాల క్రితం పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు కారణంగా మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఈయన సినిమాలలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు. """/"/ అతి తక్కువ సమయంలోనే కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేశారు.

ఎంతోమంది అనాధ చిన్నారులను చేరదీసి వారికి విద్యతో పాటు అన్ని ఖర్చులను భరించారు అలాగే వృద్ధాశ్రమాలు ఆస్పత్రులు నిర్మించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ విధంగా 40 సంవత్సరాల వయసులోనే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు తనని ఎంతగానో మిస్ అవుతున్నారని చెప్పాలి.

ఇలా ఏ వేడుకలో పాల్గొన్న పునీత్ ను గుర్తుచేసుకొని తన కుటుంబ సభ్యులు ఎమోషనల్ అవుతుంటారు.

"""/"/ ఈ క్రమంలోనే శివరాజ్ కుమార్ నటించిన వేద సినిమా తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్లో భాగంగా నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఇక ఈ వేడుకలో భాగంగా పునీత్ స్పెషల్ ఏవి వేయడంతో ఒక్కసారిగా శివరాజ్ కుమార్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇలా శివరాజ్ కుమార్ కన్నీళ్లు పెట్టుకోవడంతో బాలయ్య తనని ఓదార్చారు.అనంతరం శివరాజ్ కుమార్ మాట్లాడుతూ పునీత్ మన మధ్య లేకపోయినా తనని నేను టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ లో చూసుకుంటున్నాను అని తెలిపారు.

అల్లు అర్జున్ డాన్సింగ్ స్టైల్ లో తనకు పునీత్ కనిపిస్తారని అందుకే తనలో తాను తన సోదరుడు పునీత్ రాజ్ కుమార్ ను చూసుకుంటున్నానని ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఏంటి భయ్యా.. యమలోకానికి పిలుపు వచ్చిందా? బండి అలా తోలుతున్నావ్(వీడియో)