నైట్ షిఫ్ట్ చేస్తున్నారా..? అయితే మీ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడవచ్చు..!
TeluguStop.com
మారుతున్న ఈ కాలంలో ఉద్యోగుల పని వేళలలో కూడా చాలా మార్పులు వచ్చాయి.
అయితే మీడియా, ఐటి, ఫార్మా లాంటి వివిధ రంగాల్లో 24 గంటలు పాటు కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి.
దీంతో ఉద్యోగులు షిఫ్ట్ లపై షిఫ్ట్ లు చేస్తున్నారు.అయితే ఒక వారం ఉదయం పనిచేస్తే మరొక వారం రాత్రిపూట ఆఫీసులోకి వెళ్తున్నారు.
ఇక కంపెనీ అవసరాలకు లోబడి పని చేస్తున్నప్పటికీ కూడా ఇలా రొటేషన్ షిప్టుల్లో, నైట్ షిఫ్టుల్లో( Night Shift ) పనిచేస్తే కచ్చితంగా ఉద్యోగి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దీనివల్ల ఎన్నో వ్యాధులు చుట్టుముడతాయని, చివరికి వీరి జీవిత కాలమే తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అయితే ముఖ్యంగా నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఈ విషయంపై అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో అధ్యయనం ప్రచురితమైంది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా హెల్త్ కేర్( Health Care ) రంగానికి చెందిన సిబ్బంది నైట్ షిఫ్టులో పనిచేస్తున్నారని ఈ స్టడీ ద్వారా తెలిసింది.
ఇలా ఐదేళ్ల కన్నా ఎక్కువగా పని చేస్తే మహిళలపై తీవ్ర దుష్ప్రభావాలు పడతాయని అందులో పేర్కొంది.
"""/" /
అయితే ఇలాంటి వారిలో గుండె నాళాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని తెలిసింది.
ఇక నైట్ షిఫ్ట్ లో పనిచేయడంతో నిద్రలేమి సమస్య( Insomnia ) కూడా దారితీస్తుందని ఈ రీసెర్చ్ తెలిపింది.
ప్రధానంగా మహిళల జీవ గడియారం దెబ్బతింటుందని వెల్లడించింది.రొటేషనల్ షిఫ్టుల్లో పనిచేసే వారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వెల్లువెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.
అలాగే బరువు పెరగడం, చికాకు కలుగడం, మెదడు భారంగా అనిపించడం, ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యలు కూడా త్వరగా దరిచేరే ముప్పు ఉంటుందని వారు చెబుతున్నారు.
"""/" /
దీంతోపాటు అజీర్తి సమస్యలు, ఎసిడిటీ, మలబద్ధకం, డయేరియా ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా అటాక్ చేస్తాయని హెచ్చరిస్తున్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు ప్రతిరోజు వ్యాయామం చేయాలి.
ఇక మనిషికి నిద్ర చాలా అవసరం తప్పనిసరిగా నిద్రను భర్తీ చేయాల్సి ఉంటుంది.
అలాగే పౌష్టికాహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి.అలాంటి సమయంలోనే ఇలాంటి ప్రమాదకరమైన సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
ఏంటి గోవా ఒక టూరిస్టు ట్రాపా.. దాన్ని బహిష్కరించాలంటూ నెట్టింట రచ్చ!