జొన్న అటుకులను ఈ విధంగా తీసుకుంటే ఈజీగా బ‌రువు త‌గ్గుతారు!

జొన్న‌లు.ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత జొన్న‌ల‌నే అత్య‌ధికంగా వినియోగిస్తుంటారు.జొన్న‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు.

అయితే జొన్న‌ల నుండి త‌యారు చేయ‌బ‌డే జొన్న అటుకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.ముఖ్యంగా బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నించే వారికి జొన్న అటుకులు ఉత్త‌మ‌మైన ఆహారంగా చెప్పుకోవ‌చ్చు.

ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా జొన్న అటుకుల‌ను తీసుకుంటే ఈజీగా బ‌రువు త‌గ్గుతారు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం జొన్న అటుకుల‌ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో క‌ప్పు లోఫ్యాట్ పెరుగు, మూడు టేబుల్ స్పూన్ల జొన్న అటుకులు వేసి బాగా క‌లుపుకుని అర గంట పాటు నాన‌బెట్టుకోవాలి.

ఈలోపు ఒక క్యారెట్‌ను తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డిగి స‌న్న‌గా తురుముకోవాలి.

అలాగే మ‌రోవైపు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనెను వేయాలి.

"""/"/ ఆయిల్ హీట్ అవ్వ‌గానే అందులో పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీల‌క‌ర్ర‌, వ‌న్ టేబుల్ స్పూన్ శనగ పప్పు, వ‌న్ టేబుల్ స్పూన్ మిన‌ప‌ప్పు, గుప్పెడు వేరుశనగలు, మూడు ఎండు మిర్చీలు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం త‌రుగు, రెండు రెబ్బ‌ల క‌రివేపాకు వేసి వేయించుకోవాలి.

ఈ వేయించుకున్న ప‌దార్థాల‌న్నీ జొన్న‌ అటుకుల్లో వేసుకోవాలి.అలాగే క్యారెట్ తురుము, రుచికి స‌రిప‌డా పింక్ సాల్ట్ వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

సూప‌ర్ టేస్టీగా ఉండే ఈ జొన్న అటుకుల రెసిపీని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో లేదా లంచ్ లో తీసుకుంటే.

వేగంగా వెయిట్ లాస్ అవుతారు.అతి ఆక‌లి దూరం అవుతుంది.

నీర‌సం, అల‌స‌ట వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మ‌రియు రోజంతా బాడీ యాక్టివ్‌గా కూడా ప‌ని చేస్తుంది.

Victory Venkatesh : వెంకటేష్ చేసిన ఆ సినిమా అంటే ఈ స్టార్ హీరో కి చాలా ఇష్టమట…ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?