బద్దెనపల్లి గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోండి

రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా తోబుట్టువులకు రాఖీ కట్టనివ్వకుండా కర్కశంగా వ్యవహరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపళ్లి మండలం బద్దెనపల్లి ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.

మంగళవారం సిరిసిల్లలోని జిల్లా కలెక్టరేట్లో తోబుట్టువులకు రాఖీ కట్టనీయకుండా అడ్డుకున్న ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులతో ప్రతి పండుగ సందర్భంగా రాఖీలు కట్టించుకోవడానికి తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా వస్తే,ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు వారిని పాఠశాల గేటు తెరవకుండా అడ్డుకున్నారని అన్నారు.

పిల్లల్ని బయటకి పంపించమని అడిగినా కనికరం చూపలేదు అని,దీంతో చేసేదేమీ లేక ఆశగా వచ్చిన అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు కిటికీలోంచి రాఖీలు కట్టారు అని అన్నారు.

గురుకుల విద్యార్థులు రక్షా బంధన్ చేసుకోలేని దుస్థితి అని,తల్లితండ్రులు కన్నీళ్లతో ఇంటికి వెళ్లిపోవడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు.

మానవతా విలువలను పెంపొందించే పండగలను జరుపుకొనివ్వకుండా, పిల్లలు, తల్లి దండ్రుల పట్ల కర్కశంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని,లేకుంటే తీవ్ర స్థాయిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో విభాగ్ లా ఫోరమ్ కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్,టౌన్ జాయింట్ సెక్రటరీ కాసారపు నితిన్,టౌన్ వైస్ ప్రెసిడెంట్ రుద్రవేణి ధనుష్,వెంకటేష్,వంశీ తదితరులు పాల్గొన్నారు.

ఇంద్ర రీ రిలీజ్ తో చిరంజీవి మహేష్ బాబు రికార్డ్ ను బ్రేక్ చేస్తాడా..?