వాహనాలు వెళుతుండగా కూలిపోయిన వంతెన, ఎక్కడంటే?
TeluguStop.com
వాహనాలు వెళుతుండగా ఒక్కసారిగా వంతెన కుప్పకూలి పోయింది.ఈ ఘటన తైవాన్ లో చోటుచేసుకుంది.
ఒక భారీ వంతెన పై వాహనాలు వెళుతున్న సమయంలో ఉన్నట్టుండి అది కింద ఉన్న నదిలో కుప్ప కూలిపోయింది.
దీనితో ఆ సమయంలో వంతెన పై వెళుతున్న వాహనాలు కూడా నదిలో పడిపోయాయి.
ఈ ఘటన మంగళవారం ఉదయం తైవాన్ లోని నాన్ఫాంగోలో చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ ఘటనలో 14 మంది గాయపడినట్లు సమాచారం.
ప్రమాద సమయంలో ఎక్కువ వాహనాలు వంతెన పై న లేకపోవడం తో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది.
అయితే నదిలో ఉన్న బోట్ల పై బిడ్జి కూలడం తో ఈ ప్రమాదంలో 14 మంది గాయపడినట్లు తెలుస్తుంది.
ఆ సమయంలో కొద్దీ వాహనాలు మాత్రమే ఆ భారీ వంతెన పై ఉండడం తో పెను ప్రమాదం తప్పింది.
అయితే అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అన్నదానిపై ఎలాంటి సమాచారం లేదు.
"""/"/అయితే ఈ ఘటన సమాచారం అందుకున్న అధికారులు వెంటనే హుటాహుటిన అక్కడకి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.
మరోపక్క భారీ వంతెన కూలి పోయిన సమాచారం అందుకున్న కొందరు స్థానికులు అక్కడకి చేరుకొని ఫోటో లు తీయడం వంటి పనులు ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.
బాహుబలి సమయానికి నా వయస్సు అంతే.. బాహుబలి నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!