నీళ్లు మానేసి టీ, జ్యూసెస్ మాత్రమే తాగిన మహిళకు షాక్.. కిడ్నీలో 300 రాళ్లు!

నీళ్లు పూర్తిగా మానేయడం ఎంత ప్రమాదకరమో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.నీళ్లకి బదులు టీ, జ్యూసెస్ తాగితే చాలు రోజూ వారీ అవసరాలు తీరతాయని అనుకోవడం కూడా చాలా డేంజర్.

వాటర్‌ను వేరే స్వీట్ డ్రింక్స్‌తో భర్తీ చేయడం వల్ల ఆరోగ్యం సర్వనాశనం అవుతుందనే నిజం తాజాగా ఓ తైవాన్ మహిళ( Taiwan Woman ) విషయంలో నిజమైంది.

ఈ మహిళకు వాటర్( Water ) తాగడమంటే అస్సలు ఇష్టం ఉండదు.అందుకే దానికి బదులుగా బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్ తాగింది.

అదే ఆమె కొంప ముంచింది.ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ కారణంగా ఆమె కుడి కిడ్నీలో ఏకంగా 300కి పైగా కిడ్నీ రాళ్లు( Kidney Stones ) ఏర్పడ్డాయి.

వాటిని తొలగించేందుకు సదరు మహిళ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.ఇంతకీ ఆమె పేరు ఏంటంటే, జియావో యు (20).

జియావో కొన్నేళ్లుగా నీళ్లకు బదులు స్వీట్ డ్రింక్స్ మాత్రమే తాగుతోంది.వాటర్ తీసుకోక పోవడం వల్ల ఆమె చాలా కాలంగా డీహైడ్రేషన్‌తో బాధపడుతూ ఉంది, చివరికి కిడ్నీలో ఖనిజాలు పేరుకుపోయాయి.

"""/" / జియావో యును( Xiao Yu ) పరిస్థితి ఇటీవల చాలా సీరియస్ గా మారింది.

దాంతో కుటుంబ సభ్యులు ఆమెను గత వారం తైనాన్ నగరంలోని చి మెయి ఆసుపత్రికి తీసుకువెళ్లారు, ఆమె జ్వరం, తీవ్రమైన వెన్నుముక నొప్పిని అనుభవించింది.

వైద్యులు అల్ట్రాసౌండ్ స్కాన్, సిటి స్కాన్ నిర్వహించి, ఆమె కుడి కిడ్నీలో ద్రవం, వందలాది రాళ్లు నిండి ఉన్నాయని గుర్తించారు.

రాళ్ళు 5 మిమీ నుంచి 2 సెంటీమీటర్ల వరకు పరిమాణంలో మారుతూ "చిన్న స్టీమ్డ్ బన్స్" లాగా ఉన్నాయని అన్నారు.

రక్త పరీక్షలో కూడా ఆమె తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది.

"""/" / బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్‌లో చాలా చక్కెర, యాడెటివ్స్ ఉన్నాయని, ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు ఆమెకు వివరించారు.

మూత్రంలోని మినరల్స్ బయటకు పంపి, స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించడానికి నీరు అవసరమని కూడా ఆమెకు చెప్పారు.

పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ అనే సర్జరీ చేసి ఆమె కిడ్నీలోని రాళ్ళను బయటకు తీశారు.

సాధారణంగా ఈ సర్జరీలో భాగంగా వెనుక భాగంలో చిన్న కోత వేసి ట్యూబ్‌ను అమర్చి ద్రవాన్ని, రాళ్లను తొలగించడం జరుగుతుంది.

రెండు గంటలపాటు జరిగిన శస్త్రచికిత్సలో వైద్యులు ఆమె కిడ్నీ నుంచి దాదాపు 300 రాళ్లను( 300 Kidney Stones ) విజయవంతంగా వెలికితీశారు.

శస్త్రచికిత్స తర్వాత జియావో యు పరిస్థితి మెరుగుపడింది, కొన్ని రోజుల తర్వాత ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయబడింది.

పెళ్లి పీటలపైనే ప్రాణాలు కోల్పోయిన వరుడు.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!